• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కి...

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కి ముందు సీఎం రేవంత్‌తో మ‌హేష్ భేటీ

| టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే సమయంలో స్వతంత్ర మైక్రోఫిన్ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా కూడా సీఎంతో సమావేశమయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అనన్యను సీఎం ఆహ్వానించారు. మహేష్ భేటీ వెనుక వ్యాపార విస్తరణ అంశాలు ఉన్నాయా అన్న ఆసక్తి నెలకొంది.

By - Sivaji Kontham
Update: 2026-11-29 05:28 GMT

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని `స్వతంత్ర మైక్రోఫిన్` వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా కూడా కలిశారు. `తెలంగాణ రైజింగ్` విజన్‌లో అన‌న్య బిర్లా భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో 2026 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న `ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్`లో పాల్గొనాలని అనన్య బిర్లాను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు తన పూర్తి మద్దతు, భాగస్వామ్యం ఉంటుందని అనన్య బిర్లా కూడా సానుకూలంగా స్పందించారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న ఏఎంబి సినిమాస్ ని వేగంగా విస్త‌రిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఇప్ప‌టికే రెండో చోట్ల భారీ థియేట‌ర్ల స‌ముదాయాన్ని నెల‌కొల్పారు. త‌దుప‌రి ఏఎంబీ విస్త‌ర‌ణ‌కు రాజ‌కీయంగా అన్ని విధాలా క్లియ‌ర్ చేసుకుంటున్నారా? మ‌హేష్ ఇత‌ర వ్యాపారాల్లోను భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? అన్న‌ది వేచి చూడాలి. అలాగే బిర్లా గ్రూప్ అధినేత్రితో ఒకే స‌మ‌యంలో సీఎంని క‌ల‌వ‌డం వెన‌క కార‌ణాలేమిటి? అన‌న్య బిర్లాతో క‌లిసి ఏదైనా ప్రాజెక్ట్ ని చేప‌డుతున్నారా? అనేది మ‌హేష్ చెప్పాల్సి ఉంటుంది.

రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు:

మహేష్ బాబు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉన్నా.. హైదరాబాద్‌లోని ప‌లు పార్టీల అగ్రనేతలతో ఆయనకు మర్యాదపూర్వక, సానుకూల సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో అత‌డికి సత్సంబంధాలు కొనసాగుతుండగా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తోనూ ఆయనకు మంచి స్నేహపూర్వక సంబంధాలు కొన‌సాగాయి. సినిమా వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, ట్విట్టర్ సంభాషణల ద్వారా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పలుమార్లు కనిపించింది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలతో పాటు ఏపీ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ మహేష్ బాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వివాదాలకు తావివ్వకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలు లేదా మర్యాదపూర్వక భేటీల వరకే పరిమితమవుతూ తన ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.

కుటుంబ రాజ‌కీయాలు:

ఇక కుటుంబ పరంగా చూస్తే.. మహేష్ బాబు సోదరి పద్మావతి భర్త, మాజీ ఎంపీ అమరరాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ తో మహేష్‌కు అత్యంత సన్నిహిత- ఆత్మీయ అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య బంధుత్వం కేవలం కుటుంబ వేడుకలకే పరిమితం కాకుండా వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఒకరికొకరు అండగా నిలిచేంత బలంగా ఉంటుంది. గల్లా జయదేవ్ రాజకీయ ప్రస్థానానికి నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు.. కుటుంబ వ్యవహారాల్లో జయదేవ్ సలహాలను మహేష్ ఎంతో గౌరవిస్తారు. అయితే జయదేవ్ టీడీపీ తరపున క్రియాశీల రాజకీయాల్లో ఉంటున్నా.. మహేష్ మాత్రం తన సినీ కెరీర్, బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా రాజకీయ వేదికలకు దూరంగా ఉంటూనే కుటుంబ బంధాన్ని ఎంతో పరిణతితో కొనసాగిస్తున్నారు.

Tags:    
  • maheshbabu 
  • revanthreddy 
  • ananyabirla 
  • telangana 
  • hyderabad 

Similar News

అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప‌-3` ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తారా?

2026-11-29 05:29 GMT

అదిరిపోయే లుక్‌లో శివాని నాగారం.. ఫ్యాన్స్ ఫిదా!

2026-11-29 05:28 GMT

బాపూ బొమ్మను తలపిస్తున్న నిహారిక.. ట్రెడిషనల్ లుక్ వైరల్!

2026-11-29 05:28 GMT

కథ ఎంపిక, నానితో అనుబంధం: దీప్తి గంట మనసులో మాట

2026-11-29 04:52 GMT

దుల్కర్ వస్తే ఆ రేంజ్.. నా విషయంలో మాత్రం ఇలానా సుమా!

2026-11-29 04:15 GMT

నితిన్ గొడుగు పట్టడం వెనుక ఇంత కథ ఉందా..

2026-11-29 03:58 GMT

​నాని రిస్క్.. ఈసారి సుమను కూడా..

2026-11-29 03:55 GMT

విలక్ష‌ణ న‌టుడి వార‌సురాలి ప్ర‌యోగాలు ఫ‌లిస్తున్నాయ్

2026-11-29 02:30 GMT

ఇంతకీ 'విశ్వంభర' పస్ట్‌ కాపీ రెడీనా?

2026-11-29 01:30 GMT

శర్వానంద్‌ ఇక సంక్రాంతి కాపాడాలి..!

2026-11-29 00:30 GMT

'అసరీరి' హిట్‌ అయితే నానితో 96 కన్ఫర్మ్..!

2026-11-28 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS