• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ​నాని రిస్క్.. ఈసారి...

​నాని రిస్క్.. ఈసారి సుమను కూడా..

| 'అలియాస్ రుక్మిణి'పై నాని తనకున్న నమ్మకాన్ని బలమైన స్టేట్‌మెంట్‌తో చాటుకున్నారు. సినిమా నచ్చకపోతే సినిమాలు తీయడం మానేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు. డిసెంబర్ 3 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసిన మేకర్స్, పాజిటివ్ మౌత్ టాక్‌తో వీకెండ్ కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. నాని సోదరి దీప్తి గంటా సినిమా క్రియేటివ్, బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారని తెలిపారు.

By - M Prashanth
Update: 2026-11-29 03:55 GMT

చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు థియేటర్ల దాకా జనాన్ని రప్పించాలంటే కంటెంట్ మీద నిర్మాతకు ఉండే నమ్మకమే పెద్ద పెట్టుబడి. 'అలియాస్ రుక్మిణి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతున్నాయి. డిసెంబర్ 4న సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక అందమైన సినిమా చూశామన్న ఫీలింగ్ కలగకపోతే తాను సినిమాలు తీయడం మానేస్తానని, యాంకర్ సుమను కూడా కలుపుకుని నాని సరదాగా ఛాలెంజ్ విసిరారు.

పైకి ఇది ఫన్నీ మూమెంట్ లా కనిపించినా, దీని వెనుక నాని పక్కా ప్రమోషనల్ స్కెచ్ కనిపిస్తోంది. గతంలో 'కోర్ట్' సినిమా టైమ్ లోనూ నాని సరిగ్గా ఇదే ఫార్ములా వాడారు. ఆ సినిమా నచ్చకపోతే తన 'హిట్' సినిమా చూడొద్దని ఆయన చేసిన కామెంట్ అప్పట్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. నాని ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే క్రెడిబిలిటీని నాని ఎప్పుడో సంపాదించుకున్నారు.

ఇప్పుడు 'అలియాస్ రుక్మిణి' లాంటి సాఫ్ట్ ఎమోషనల్ డ్రామాకు కూడా అదే బ్రాండ్ వాల్యూను వాడుతూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో, బాక్సాఫీస్ దగ్గర అంతా లౌడ్ యాక్షన్, నెగెటివిటీ, కాంట్రవర్సీల హవా నడుస్తోంది. ఈవెంట్ లో నాని అన్నట్టుగానే 'హేట్ సెల్స్' అనే ట్రెండ్ నడుస్తున్న టైమ్ లో, ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను నమ్మి డబ్బులు పెట్టడం చిన్న రిస్క్ కాదు.

పైగా ఇందులో భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అందుకే రొటీన్ ప్రమోషన్ల కంటే, సినిమా కంటెంట్ మీద తనకున్న నమ్మకాన్ని ఇలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ల ద్వారా జనాలకు చేరవేస్తున్నారు. అందుకే శుక్రవారం మార్నింగ్ షో రివ్యూల దాకా ఆగకుండా, ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 3 రాత్రి అన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. కొత్త అమ్మాయి ఆఫియా, కమ్ బ్యాక్ రోల్ చేస్తున్న నితిన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మౌత్ టాక్ అత్యంత కీలకం.

ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తే వీకెండ్ కలెక్షన్లు ఆటోమేటిక్ గా పికప్ అవుతాయన్నది మేకర్స్ లెక్క. ఈ ఈవెంట్ ద్వారా నాని ప్రొడక్షన్ హౌస్ లో జరుగుతున్న మరో మార్పు కూడా బయటపడింది. నిర్మాతగా తనకు కేవలం క్రియేటివ్ సైడ్ మాత్రమే తెలుసని, బిజినెస్ లెక్కలు తెలియవని నాని ఓపెన్ గా చెప్పారు. కానీ తన అక్క దీప్తి గంటా మాత్రం క్రియేటివ్, బిజినెస్ రెండు వైపులా సమర్థంగా హ్యాండిల్ చేస్తూ తనకు పెద్ద బలంగా మారారని క్లారిటీ ఇచ్చారు.

ఇక సినిమాలు మానేస్తా అనే స్థాయి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా బాక్సాఫీస్ దగ్గర రివర్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ రిలీజ్ కు ముందే ఫైనల్ కట్ చూసుకున్న నాని ఏమాత్రం టెన్షన్ లేకుండా కనిపిస్తున్నారు. డిసెంబర్ 3 రాత్రి ప్రీమియర్స్ తో మొదలయ్యే అసలు టాక్, నాని ప్రొడ్యూసర్ బ్రాండ్ కు మరో హిట్ అందిస్తుందో లేదో చూడాలి.


డిసెంబర్ 4న #AliasRukmini సినిమాకు వెళ్లి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు.. ఒక Beautiful Cinema చూశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే... నేను ఇకపై సినిమాలు తీయడం మానేస్తాను.. సుమ గారు యాంకరింగ్ మానేస్తారు! - #Nani #AliasRukminiOnDec4th #Nithiin #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 28, 2026


Tags:    
  • aliasrukmini 
  • nani 
  • nithiin 
  • muralikanth 
  • aafiyasayed 
  • suma 

Similar News

దుల్కర్ వస్తే ఆ రేంజ్.. నా విషయంలో మాత్రం ఇలానా సుమా!

2026-11-29 04:15 GMT

నితిన్ గొడుగు పట్టడం వెనుక ఇంత కథ ఉందా..

2026-11-29 03:58 GMT

విలక్ష‌ణ న‌టుడి వార‌సురాలి ప్ర‌యోగాలు ఫ‌లిస్తున్నాయ్

2026-11-29 02:30 GMT

ఇంతకీ 'విశ్వంభర' పస్ట్‌ కాపీ రెడీనా?

2026-11-29 01:30 GMT

శర్వానంద్‌ ఇక సంక్రాంతి కాపాడాలి..!

2026-11-29 00:30 GMT

'అసరీరి' హిట్‌ అయితే నానితో 96 కన్ఫర్మ్..!

2026-11-28 22:30 GMT

రవితేజ, మెగా హీరో ప్లేస్‌లో బాలకృష్ణ రానున్నాడా?

2026-11-28 19:30 GMT

మంచి దారిలో విశ్వక్‌ సేన్‌, కిరణ్ అబ్బవరం..!

2026-11-28 18:30 GMT

నాగ చైతన్య ఫుడ్ వార్నింగ్

2026-11-28 17:30 GMT

'రాకా' కంటే ముందు AA23... సాధ్యమేనా?

2026-11-28 17:30 GMT

బాస్ లేడీ కృతి మిష‌న్ ఏంటో కానీ..! తిన‌డంలో ది బెస్ట్!

2026-11-28 16:57 GMT

Copyright @2026

Powered by Blink CMS