• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌ల్లవి ది గ్రేట్:...

ప‌ల్లవి ది గ్రేట్: ఔత్సాహిక న‌టీన‌టుల‌కు గొప్ప‌ మౌన‌ పాఠం!

| ‘రామాయణ’లో సీత పాత్రపై వచ్చిన విమర్శలను సాయి పల్లవి హుందాగా స్వీకరించింది. ఇతరుల అభిప్రాయాలు తన విలువను నిర్ణయించలేవని, అంతర్గత ఆత్మవిశ్వాసంతో విమర్శలను పట్టించుకోకుండా ఉండాలని అభిప్రాయపడింది. ప్రతి కామెంట్‌కు స్పందించకుండా, విమర్శలను నటిగా ఎదిగేందుకు ఉపయోగించుకోవడం నేర్చుకున్నానని తెలిపింది.

By - Sivaji Kontham
Update: 2026-11-29 06:10 GMT

సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా విమర్శ లేదా ట్రోలింగ్ ఎదురైతే సినీ తారలు వెంటనే ఆవేశపడటం, సుదీర్ఘ వివరణలు ఇవ్వడం లేదా పీఆర్ బృందాల ద్వారా కౌంటర్లు వేయించడం నేటి డిజిటల్ యుగంలో పరిపాటిగా మారింది. కానీ విల‌క్ష‌ణ‌ నటి సాయి పల్లవి ఈ విషయంలో పూర్తి భిన్నమైన- పరిణతితో కూడిన మార్గాన్ని ఎంచుకుంటారు. భారీ అంచనాల మధ్య విడుదలైన `రామాయణ` చిత్రంలో సీత పాత్రపైనా త‌న‌ ఆహార్యంపైనా తీవ్ర స్థాయిలో చర్చలు జ‌రిగి విమర్శలు ఎదురైనా త‌ను ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ``బయటి వ్యక్తుల అభిప్రాయాలు మన విలువను నిర్ణయించవు.. మన లోపల బలం ఉంటే బయటి సౌండ్స్‌ని పక్కన పెట్టవచ్చు`` అంటూ ఘాటైన సమాధానం ఇవ్వ‌గా.. విమర్శకులను ఎదుర్కొనే విషయంలో ఒక హుందాతనమైన ప్రమాణాన్ని నెలకొల్పింది.

నేటి భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల ఇమేజ్ అనేది కేవలం గ్లామర్.. బాక్సాఫీస్ సంఖ్యల చుట్టూనే తిరుగుతుందనే అపోహ బలంగా ఉంది. అయితే సాయి పల్లవి తన కెరీర్ ఆరంభం నుంచీ ఈ మూసధోరణిని బద్దలు కొడుతూ వస్తున్నారు. మేకప్ లేకుండా సహజంగా కనిపించడం నుంచి.. వాణిజ్య ప్రకటనలను తిరస్కరించడం వరకు .. ప్రతి అడుగులోనూ సాయిప‌ల్ల‌వి తన వ్యక్తిత్వానికి.. విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఒక వైపు `రామాయణ`లో సీత పాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. మరోవైపు అదే నెలలో వచ్చిన `ఓం` చిత్రంలో నటనకు ప్రశంసలు కురిసినా.. రెండింటినీ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో స్వీకరించగలుగుతున్నారు. విమ‌ర్శ‌ల‌కు ఝ‌డ‌వ‌డం.. పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోవ‌డం రెండూ లేవు. ఈ త‌ర‌హా వ్య‌క్తిత్వం ఉన్న ఏకైక న‌టి సాయిపల్ల‌వి.

స్టార్‌డమ్ అంటే కేవలం ప్రశంసలను ఆస్వాధించడం మాత్రమే కాదు.. విమర్శలను కూడా వృత్తిపరమైన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకోవడమని సాయి పల్లవి నిరూపిస్తున్నారు. చుట్టూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటాను.. కానీ ప్రతిస్పందించకుండా ఉండటం నేర్చుకున్నాను.. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే మంచి నటులుగా మారతాం! అన్న సాయిప‌ల్ల‌వి మాటలు నేటి తరం నటీనటులకు ఒక పాఠం లాంటివి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ.. తన పనితోనే సమాధానం చెప్పే ఈ ధోరణి.. త‌న‌ను కేవలం ఒక స్టార్ హీరోయిన్‌గా కాకుండా ప్రేక్షకులు గౌరవించే వ్యక్తిత్వం ఉన్న కళాకారిణిగా నిలబెట్టింది.

సోష‌ల్ మీడియాల్లో ట్రోల్ ఆర్మీలు సెలబ్రిటీల మానసిక ప్రశాంతతను శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో సాయి పల్లవి వైఖరి నేటి ఔత్సాహిక తార‌ల‌కు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. బయటి మెరుగుల కంటే అంతర్గత ఆత్మవిశ్వాసం, పాత్ర విష‌యంలో నిజాయితీ ఉన్నప్పుడే ఏ విమర్శైనా తాత్కాలికమని సాయిపల్ల‌వి చేతలు చెబుతున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే తనదైన సిద్ధాంతాలతో, హుందాతనంతో ముందుకు సాగుతున్న సాయి పల్లవి ప్రయాణం.. భవిష్యత్తులో ఈ రంగంలో ప్ర‌వేశించ‌నున్న‌ ఎందరో నటీమణులకు సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    
  • saipallavi 
  • ramayana 
  • sita 
  • tollywood 
  • bollywood 

Similar News

ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్ చూసే అవకాశం!

2026-11-29 06:10 GMT

అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప‌-3` ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తారా?

2026-11-29 05:29 GMT

అదిరిపోయే లుక్‌లో శివాని నాగారం.. ఫ్యాన్స్ ఫిదా!

2026-11-29 05:28 GMT

బాపూ బొమ్మను తలపిస్తున్న నిహారిక.. ట్రెడిషనల్ లుక్ వైరల్!

2026-11-29 05:28 GMT

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కి ముందు సీఎం రేవంత్‌తో మ‌హేష్ భేటీ

2026-11-29 05:28 GMT

కథ ఎంపిక, నానితో అనుబంధం: దీప్తి గంట మనసులో మాట

2026-11-29 04:52 GMT

దుల్కర్ వస్తే ఆ రేంజ్.. నా విషయంలో మాత్రం ఇలానా సుమా!

2026-11-29 04:15 GMT

నితిన్ గొడుగు పట్టడం వెనుక ఇంత కథ ఉందా..

2026-11-29 03:58 GMT

​నాని రిస్క్.. ఈసారి సుమను కూడా..

2026-11-29 03:55 GMT

విలక్ష‌ణ న‌టుడి వార‌సురాలి ప్ర‌యోగాలు ఫ‌లిస్తున్నాయ్

2026-11-29 02:30 GMT

ఇంతకీ 'విశ్వంభర' పస్ట్‌ కాపీ రెడీనా?

2026-11-29 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS