• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీ అట్లూరి న‌ట‌న...

వెంకీ అట్లూరి న‌ట‌న మానేసి ద‌ర్శ‌క‌త్వంలోకి.. ఈ హీరోనే కార‌ణం!

| దర్శకుడు వెంకీ అట్లూరి తన కెరీర్ మలుపు వెనుక హీరో నాని సలహా ఉందని వెల్లడించారు. తాను నటుడిగా ప్రయత్నిస్తున్న రోజుల్లోనే నటన మానేసి దర్శకత్వంపై దృష్టి పెట్టాలని నాని సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. ‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన వెంకీ, సినిమా విడుదలైన రోజే ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని నిర్మాతకు మెసేజ్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

By - Sivaji Kontham
Update: 2026-11-29 07:06 GMT

ఎంపిక చేసుకున్న క‌థాంశాల‌లో సున్నితమైన భావోద్వేగాలు- బలమైన సందేశానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత మెగాఫోన్ పట్టి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన వెంకీ తన ప్రతి సినిమాలోనూ రచయితగా ప్రత్యేక సెన్సిబిలిటీని చాటుకుంటూ వస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.. నెమ్మ‌ది అయిన మ‌న‌స్త‌త్వం వెంకీ అట్లూరిలో కనిపించే మ‌రో ప్రధాన ఆకర్షణ. తాజాగా `అలియాస్ రుక్మిణి` ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడిన వెంకీ అట్లూరి తన కెరీర్ మలుపు వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని.. హీరో నాని ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నారు.

తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తుచేసుకుంటూ.. దాదాపు 16 ఏళ్లుగా తనకు నాని తెలుసని వెంకీ అట్లూరి తెలిపారు. తాను ఒక చిన్న స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పుడే ``నటన మానేసి ముందు దర్శకత్వం వైపు వెళ్లు`` అని చెప్పిన మొదటి వ్యక్తి నానినే అని వెల్లడించారు. అప్పట్లో నాని ఎందుకు అలా అన్నారో తనకు అర్థం కాలేదని.. కానీ ఆరేడేళ్ల తర్వాత తాను దర్శకుడిగా మారి తొలి సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు నాని మాటల వెనుక ఉన్న విజన్ ఏంటో స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. అ!, హిట్, కోర్ట్ వంటి విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుల‌ను గుర్తించి ప్రోత్సహించిన నానికి టాలెంట్‌ను పసిగట్టే అద్భుతమైన దృష్టి ఉందని వెంకీ ప్రశంసించారు.

వెంకీ అట్లూరి సినిమాలను గమనిస్తే.. తొలి చిత్రం `తొలి ప్రేమ` నుంచి `మిస్టర్ మజ్ను`..`రంగ్ దే`, `సార్` (వాతి), `లక్కీ భాస్కర్` వరకు ప్రతి కథలోనూ రచయితగా అత‌డి లోతైన పరిశీలన, విభిన్న‌మైన శైలి స్పష్టంగా కనిపిస్తాయి. ప్రేమకథల్లోని సున్నితత్వమైనా.. విద్యా వ్యవస్థ లేదా ఆర్థిక అంశాల చుట్టూ అల్లిన సామాజిక నేపథ్యమైనా... సామాన్యుడి భావోద్వేగాలను కమర్షియల్ హంగులతో మేళవించి చెప్పడం అత‌డి శైలి. తమిళ అగ్రహీరో `సూర్య`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన ప్రతిష్టాత్మక చిత్రం `విశ్వ‌నాథ‌న్ అండ్ స‌న్స్‌`లోనూ ఇదే తరహా బలమైన డ్రామా- మానవీయ విలువలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇక ఈ వేదికపై హీరో నితిన్.. నిర్మాత సుధాకర్ రెడ్డిలపైనా వెంకీ అట్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో నితిన్‌తో తాను చేసిన `రంగ్ దే` అనుకున్నంత దూరం వెళ్లలేదని.. అయితే నితిన్‌కు ఒక్క స‌రైన క‌థ‌ పడితే పెద్ద విజయం ఖాయమనే కోరిక ఎప్పటినుంచో ఉండేదని చెప్పారు. `అలియాస్ రుక్మిణి` ఆ కోరికను తీరుస్తుందని నమ్ముతున్నానని.. సినిమా విడుదల రోజు ఫస్ట్ షో ముగిసిన ఐదు నిమిషాల్లోనే ``ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్`` అంటూ నిర్మాత సుధాకర్ రెడ్డికి మెసేజ్ పెడతానని ధీమా వ్యక్తం చేశారు.

వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపైనా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఈవెంట్ చివర్లో ఆయన తదుపరి సినిమా గురించి హోస్ట్ ఆరా తీయగా.. ముందే చెబితే దిష్టి తగులుతుందని.. ప్రస్తుతం కథ రాస్తున్నాన‌ని వెంకీ అట్లూరి సరదాగా దాటవేశారు. నటుడిగా మొదలై.. నాని సూచనతో దర్శకుడిగా మారి.. నేడు పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టులకు దిశానిర్దేశం చేస్తున్న వెంకీ అట్లూరి ప్రయాణం.. కొత్తగా పరిశ్రమలోకి వచ్చే ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


#Nani... మీరు టాలెంట్‌ను చాలా బాగా గుర్తిస్తారు. అది #AAa నుంచి కావచ్చు.. #HIT నుంచి కావచ్చు.. లేదంటే #Court నుంచి కావచ్చు. ఇప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. - Director #VenkyAtluri #AliasRukmini #AliasRukminiOnDec4th #Nithiin #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official

— Tupaki (@tupaki_official) November 28, 2026


Tags:    
  • venkyatluri 
  • nani 
  • aliasrukmini 
  • nithiin 
  • sudhakarreddy 

Similar News

రెండో వారంలో 'ఆకాశంలో ఒక తార' మెరిసేది ఎంత?

2026-11-29 07:07 GMT

Bigg Boss Telugu 10: కెప్టెన్ అమన్ & ముఖేష్‌లకు గట్టి వార్నింగ్!

2026-11-29 07:06 GMT

Bigg Boss Telugu 10: 12వ వారం డబుల్ ఎలిమినేషన్ షాక్!

2026-11-29 07:05 GMT

వృషకర్మ’ ఆరంభమే అదిరిపోతుంది.. కార్తిక్ దండు క్రేజీ కామెంట్స్!

2026-11-29 07:05 GMT

ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్ చూసే అవకాశం!

2026-11-29 06:10 GMT

ప‌ల్లవి ది గ్రేట్: ఔత్సాహిక న‌టీన‌టుల‌కు గొప్ప‌ మౌన‌ పాఠం!

2026-11-29 06:10 GMT

అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప‌-3` ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తారా?

2026-11-29 05:29 GMT

అదిరిపోయే లుక్‌లో శివాని నాగారం.. ఫ్యాన్స్ ఫిదా!

2026-11-29 05:28 GMT

బాపూ బొమ్మను తలపిస్తున్న నిహారిక.. ట్రెడిషనల్ లుక్ వైరల్!

2026-11-29 05:28 GMT

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌-2026కి ముందు సీఎం రేవంత్‌తో మ‌హేష్ భేటీ

2026-11-29 05:28 GMT

కథ ఎంపిక, నానితో అనుబంధం: దీప్తి గంట మనసులో మాట

2026-11-29 04:52 GMT

Copyright @2026

Powered by Blink CMS