• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమను నిలబెట్టే...

ప్రేమను నిలబెట్టే విధ్వంసం.. 'నీరో' గ్లింప్స్ పై ప్రముఖుల ప్రశంసలు!

| బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా ‘నీరో’ సినిమా గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కల్యాణ చక్రవర్తి త్రిపురనేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రేమను నిలబెట్టేందుకు జరిగే విధ్వంసమే సినిమా కథాంశమని దర్శకుడు వెల్లడించారు.

By - M Prashanth
Update: 2026-11-29 07:39 GMT

అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నీరో'. గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటల రచయిత కల్యాణ చక్రవర్తి త్రిపురనేని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ, తన టీమ్ లో పాటలు, స్క్రిప్ట్ చర్చల్లో పనిచేసిన కల్యాణ చక్రవర్తి దర్శకుడిగా మారడం ఆనందంగా ఉందన్నారు. గ్లింప్స్ తోనే ఇదొక మంచి సినిమా అని ప్రూవ్ అవుతోందని, అరవింద్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయని, అనురాగ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రశంసించారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, రైటర్ గా పేరు తెచ్చుకున్న కల్యాణ్ దర్శకుడిగానూ నిరూపించుకోవాలని, నిర్మాతకు ఈ చిత్రం మంచి లాభాలు తీసుకురావాలని కోరుకున్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ఓషో వెంకట్ మ్యూజిక్, రామ్ ప్రసాద్ విజువల్స్ సినిమాకు మాస్ కమర్షియల్ ఫీల్ తెచ్చాయని, 'బేబి' చిత్రానికి పాట రాసిన కల్యాణ్ డైలాగ్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి విజువల్ డీటెయిల్స్, టెక్నీషియన్స్ ఎమోషనల్ ఇన్వెస్ట్ మెంట్ బాగున్నాయని అనగా, దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ, రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ తో పాటు అరవింద్ నటన కొత్త తరహా ప్రేమ కథను చూపిస్తోందని చెప్పారు.

దర్శకుడు కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ, 'నీరో' కథలో కన్నీళ్లు అంటుకోని కాగితాలు ఉంటాయేమో గానీ ప్రేమ అంటుకోని అక్షరాలు ఉండవని, ప్రేమను నిలబెట్టేందుకు జరిగే విధ్వంసమే ఈ చిత్రమని చెప్పారు. 150కి పైగా పాటలు, 9 సినిమాలకు స్క్రిప్ట్ రాసిన కల్యాణ్ చెప్పిన ఈ కథ వినగానే వావ్ అనిపించిందని, ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత అనురాగ్ పర్వతనేని తెలిపారు. వేరే కెరీర్ లో ఉన్న తనను అనురాగ్ ప్రోత్సహించారని, కల్యాణ్ నెరేషన్ నచ్చి ఈ సినిమా చేశానని హీరో అరవింద్ అన్నారు.

నటుడు శివాజి మాట్లాడుతూ, కొత్త నెరేటివ్ తో సాగే ప్రేమ కథ ఇదని, తన పాత్రకు మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో 'తీక్షణ' అనే ప్రత్యేక పాత్ర చేశానని హీరోయిన్ అర్చన అయ్యర్ చెప్పగా, తొలిసారి స్క్రీన్ పై చూసుకోవడం కొత్తగా ఉందని హారిక నారాయణ్ అన్నారు. ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉందని సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ ఓషో వెంకట్ తెలపగా, నటులు రఘు కుంచె, రాజా చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఈ సినిమాలో ప్రవీణ్, అశ్రిత వేముగంటి, దీప్తి నల్లమోతు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ పొడపాటి డైలాగ్స్ అందించగా, నిరంజన్ దేవరమనె ఎడిటింగ్, జి. ముని శేఖర్ ఆర్ట్ డైరెక్షన్, రామ్ క్రిషన్ ఫైట్స్, రాఘవ్ తమ్మారెడ్డి వీఎఫ్ఎక్స్ అందిస్తున్నారు.

Tags:    
  • niro 
  • boyapatisrinu 
  • aravind 
  • archanaiyer 
  • harikanarayan 
  • kalyanchakravarthy 
  • niromovie 

Similar News

బాలయ్యకు ఎలా సాధ్యం అవుతోంది?

2026-11-29 07:30 GMT

రెండో వారంలో 'ఆకాశంలో ఒక తార' మెరిసేది ఎంత?

2026-11-29 07:07 GMT

Bigg Boss Telugu 10: కెప్టెన్ అమన్ & ముఖేష్‌లకు గట్టి వార్నింగ్!

2026-11-29 07:06 GMT

వెంకీ అట్లూరి న‌ట‌న మానేసి ద‌ర్శ‌క‌త్వంలోకి.. ఈ హీరోనే కార‌ణం!

2026-11-29 07:06 GMT

Bigg Boss Telugu 10: 12వ వారం డబుల్ ఎలిమినేషన్ షాక్!

2026-11-29 07:05 GMT

వృషకర్మ’ ఆరంభమే అదిరిపోతుంది.. కార్తిక్ దండు క్రేజీ కామెంట్స్!

2026-11-29 07:05 GMT

ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్ చూసే అవకాశం!

2026-11-29 06:10 GMT

ప‌ల్లవి ది గ్రేట్: ఔత్సాహిక న‌టీన‌టుల‌కు గొప్ప‌ మౌన‌ పాఠం!

2026-11-29 06:10 GMT

అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప‌-3` ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తారా?

2026-11-29 05:29 GMT

అదిరిపోయే లుక్‌లో శివాని నాగారం.. ఫ్యాన్స్ ఫిదా!

2026-11-29 05:28 GMT

బాపూ బొమ్మను తలపిస్తున్న నిహారిక.. ట్రెడిషనల్ లుక్ వైరల్!

2026-11-29 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS