నవీన్ పొలిశెట్టి హ్యూమర్ మేజిక్.. పెద్దవాళ్ల మధ్య చేసిన ఫన్నీ కామెంట్ వైరల్!
ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పక్కనే డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కూడా ఉన్నారు.
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి తన టైమింగ్‌తో, అదిరిపోయే హ్యూమర్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మాస్ డైరెక్టర్లందరినీ ఒకే ఫ్రేమ్‌లో నిలబెట్టి.. "నా లైఫ్‌లోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఫ్రేమ్ ఇదే.. మొత్తం ₹5,500 కోట్ల ఫ్రేమ్" అంటూ నవీన్ తనదైన శైలిలో చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
రూ.5,500 కోట్ల ఫ్రేమ్.. లెక్కలు తేల్చిన నవీన్:
మైత్రీ మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన గెట్-టుగెదర్ పార్టీలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకులు ఒకేచోట చేరారు. ఈ క్రేజీ మూమెంట్‌ను నవీన్ పొలిశెట్టి ఒక ఫన్నీ వీడియోగా మార్చేశారు. ఒక్కొక్కరి బాక్సాఫీస్ కలెక్షన్లను లెక్కగడుతూ... లోకేష్ కనగరాజ్ (రూ.500 కోట్లు), రిషభ్ శెట్టి (రూ .800 కోట్లు), ప్రశanth నీల్ (రూ.2000 కోట్లు), సుకుమార్ (రూ.2000 కోట్లు) అంటూ అందరినీ ఆటపట్టించారు. ఈ వేల కోట్ల క్లబ్ డైరెక్టర్ల పక్కన తాను నిలబడి, తన సినిమాల కలెక్షన్ రూ.100 కోట్లను కూడా వాటికి జోడించి, మొత్తం రూ.5,500 కోట్ల ఫ్రేమ్ అంటూ నవ్వులు పూయించారు.
డైరెక్టర్ల నవ్వులు.. నవీన్ పంచ్‌లు:
ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పక్కనే డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని కూడా ఉన్నారు. ఇంతమంది స్టార్ డైరెక్టర్ల మధ్య నవీన్ ఎలాంటి తడబాటు లేకుండా ఎంతో కాన్ఫిడెంట్‌గా జోకులు వేస్తుంటే, పక్కనే ఉన్న సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ నవ్వులు ఆపుకోలేకపోయారు. పెద్ద పెద్ద సెలబ్రిటీల మధ్య కూడా తన మార్క్ హ్యూమర్ మ్యాజిక్‌ను చూపిస్తూ నవీన్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
'అనగనగా ఒక రాజు' సక్సెస్.. నెక్స్ట్ మూవీ మైత్రీతోనే:
గత ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన నవీన్ పొలిశెట్టి చిత్రం 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ తెచ్చి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ జోష్‌లోనే ఉన్న నవీన్, వచ్చే ఏడాది సరికొత్త సినిమాతో మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నట్లు ఈ వీడియో ద్వార తెలిపినట్టే. ఇక ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు.
నవీన్ పొలిశెట్టి ఎక్కడుంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదని ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది. వేల కోట్ల మార్కెట్ ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్లను ఒకే ఫ్రేమ్‌లోకి తెచ్చి, తన కామెడీ టైమింగ్‌తో వారిని కూడా నవ్వించిన నవీన్ టాలెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రాబోతున్న నవీన్ నెక్స్ట్ సినిమా కూడా 'జాతి రత్నాలు' రేంజ్‌లో హిట్టయి, బాక్సాఫీస్ దగ్గర మరిన్ని కలెక్షన్ల వర్షం కురిపించాలని కోరుకుందాం.