• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంటర్టైన్మెంట్ కా బాప్...

ఎంటర్టైన్మెంట్ కా బాప్ నెట్ ఫ్లిక్స్.. సినిమాలే సినిమాలు

| ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలుగు హిట్ సినిమాల హక్కులు దక్కించుకొని ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-07-19 23:30 GMT

ఏ సినిమానైనా థియేట్రికల్ రన్ పూర్తియ్యాక, ఓటీటీ బాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తెలుగు హిట్ సినిమాల హక్కులు దక్కించుకొని ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ దాదాపు డాకు మహారాజ్, తండేల్, కోర్ట్, హిట్- 3, మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించింది. ఇక 2025 సెకండ్ హాఫ్ లోనూ భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. మరి ఈ సినిమాలు ఏంటో చూసేద్దాం!

ఓజీ : పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. నవంబర్ లో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

కింగ్‌ డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా కింగ్ డమ్. ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఆయన డాకు మహారాజ్, లక్కీ భాస్కర్ సినిమాల విజయాల జోరుతో నాగవంశీ ఈ సినిమాతోనూ హిట్ ట్రాక్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలను గతంలో ఆయన లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ కే అమ్మారు. తాజాగా ఈ సినిమాను కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. జూలై 31న విడుదల కానున్న ఈ సినిమా, సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

మాస్ జాతర : మాస్ మహారాజ రవితేజ మాస్ జాతర సినిమాతో రానున్నారు. రవితేజ ఇందులో పోలీసుగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. రీసెంట్ గా నెట్‌ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. అక్టోబర్ లో ఇది ఓటీటీలో కి వచ్చే ఛాన్స్ ఉంది.

ఆంధ్ర కింగ్ తాలూకా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ కు ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ అవసరం. ఈ సినిమా కంప్లీట్ ఫీల్ గుడ్ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతోంది. మహేష్ పి దర్శకుడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించ లేదు. కానీ ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ హక్కులు మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలతోపాటు బాలకృష్ణ అఖండ 2, ప్రభాస్ రాజా సాబ్ సినిమాల హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags:    
  • NetflixTelugu 
  • OGOnNetflix 
  • KingdomMovie 
  • MassJathara 
  • TeluguOTT2025 
  • OGMovie 
  • VijayDeverakonda 
  • RaviTeja 
  • NetflixIndia 
  • Tollywood2025 

Similar News

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS