ఓజిలోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ.. ఎవరంటే?

ఓజి ప్ర‌మోష‌న్స్ తో పాటూ, క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి.;

Update: 2025-08-30 06:17 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఓజి. ఇప్ప‌టికే ఈ సినిమా సినీ ప్రియుల్లో భారీ అంచ‌నాలు తెర‌కెక్కిస్తుంది. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా వ‌స్తోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఈ సినిమా కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ తో పాటూ సాధార‌ణ సినీ ప్రియులు కూడా ఎంత‌గానో వెయిట్ చేస్తున్నారు.

ఓజిలో రాధిక

రిలీజ్ ద‌గ్గ‌ర పడుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నారు. ఓజి ప్ర‌మోష‌న్స్ తో పాటూ, క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ లో జోష్ ను పెంచుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. టాలీవుడ్ లో త‌క్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీని ద‌క్కించుకున్న నేహా శెట్టి ఈ సినిమాలో మెర‌వ‌నుంద‌ని స‌మాచారం.

రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన నేహా శెట్టికి డీజే టిల్లు సినిమాతో బాగా పాపులారిటీ ద‌క్కింది. డీజే టిల్లులో రాధికగా న‌టించి యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నేహాశెట్టి ఓజి సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌నున్నార‌ని గ‌తంలో వార్త‌లు రాగా, ఇప్పుడు ఈ విష‌యాన్ని నేహానే స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఫ్యాన్స్ కు స‌ర్‌ప్రైజ్‌

ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నేహా శెట్టి తాను ఓజిలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే సినిమాలో తాను క‌నిపించ‌డం ఫ్యాన్స్ కు స‌ర్‌ప్రైజ్ అని హింట్ ఇచ్చిన నేహా తాను స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుందా లేదా స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేయ‌నుందా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. ఏదేమైనా ఓజి లాంటి మోస్ట్ అవెయిటెడ్ సినిమాలో నేహా శెట్టి స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఫ్యాన్స్ కు ట్రీట్ గా మార‌డం గ్యారెంటీ అనే చెప్పాలి.

Tags:    

Similar News