ఇప్పుడు ఏ హీరోకీ కంఫర్ట్ జోన్ లేదు
హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు, డైరెక్టర్ల నుంచి నిర్మాతల వరకు అందరూ కొత్తదనాన్ని కోరుకుంటూ ప్రయోగాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు.;
ఒకప్పుడు ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హిట్ చాలా కాలం గుర్తుండిపోయేది కానీ ఇప్పుడలా కాదు, కాలం, పరిస్థితులు అన్నీ మారాయి. ఒకప్పటిలా ఇప్పుడు రోజులు లేవు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమాలు రావడం ఎక్కువయ్యాయి. సినిమాలు ఎక్కువ అవడంతో సక్సెస్ రేటు తగ్గింది. మునుపటి కంటే ఎక్కువ సినిమాలు హిట్టవుతున్నా సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉంటుంది.
ప్రయోగాలకు పెద్ద పీట
హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు, డైరెక్టర్ల నుంచి నిర్మాతల వరకు అందరూ కొత్తదనాన్ని కోరుకుంటూ ప్రయోగాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోలు విలన్లుగా మారుతున్నారు. సపోర్టింగ్ రోల్స్ చేసే వారు కూడా పాత్రా ప్రాధాన్యం ఉన్న సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఏదేమైనా కథల నుంచి, సక్సెస్ ను ఎంజాయ్ చేసే వరకు ఏ విషయంలోనూ ఒకప్పుడు ఉన్నంత కంఫర్ట్ అయితే లేదు.
ఆగస్ట్ 27న సుందరాకాండ రిలీజ్
ఇదే విషయాన్ని చెప్తున్నారు టాలీవుడ్ హీరో నారా రోహిత్. తను హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుందరకాండ. ఈ మూవీ ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన నారా రోహిత్ హీరోలు, ఆర్టిస్టుల కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడారు.
ఇప్పుడు ఏ హీరోకీ కంఫర్ట్ జోన్ లేదు
ఇప్పుడు ఏ హీరోకీ కూడా ఒకప్పుడున్నంత కంఫర్ట్ జోన్ లేదని, గతంలో ఒక్క హిట్ వచ్చిందంటే నాలుగు ఐదు సినిమాల వరకు ఎలాంటి టెన్షన్ ఉండేది కాదని, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని అంటున్నారు నారా వారబ్బాయి. సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారో, కథ వినేటప్పుడు తాను కూడా అలానే ఉంటానని, స్క్రిప్ట్ కొత్తగా ఉందనిపిస్తే కచ్ఛితంగా ఆ సినిమా చేయడానికి ప్రయత్నిస్తానని, ఎవరైనా మంచి విలన్ క్యారెక్టర్ ను రాసి తీసుకొస్తే విలన్ గా నటించడానికి కూడా రెడీ అంటున్నారు నారా రోహిత్. మరి రోహిత్ ను అలాంటి పాత్రతో ఎవరు మెప్పిస్తారో చూడాలి.