రోహిత్ ను ఓదార్చిన శ్రీనివాస్, మనోజ్.. బాండింగ్ అంటే అది!

టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన మూవీ భైరవం రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-05-26 06:33 GMT

టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన మూవీ భైరవం రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా, మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఆ సమయంలో నారా రోహిత్.. భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఇటీవల మరణించగా, ఆ విషయాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.

ముందుకు సినిమా కోసం మాట్లాడారు. "నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సురేష్ గారికి.. ఆయనే మంచి ప్రాజెక్టు నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ రోజు నేను చూడకపోయింటే మంచి మూవీని మిస్ అయ్యేవాడిని. మనోజ్, సాయి శ్రీనివాస్ తో మూవీ చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్.. సాయి నీ అప్ కమింగ్ మూవీస్ కు ఆల్ ది బెస్ట్" అంటూ చెప్పారు నారా రోహిత్.

"విజయ్ గారితో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. స్పీడ్ గా షూట్ చేశారు. మీ కష్టమంతా స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి, భవిష్యత్తులో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ రాధామోహన్ సినిమాకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు" అని నారా రోహిత్ చెప్పారు.

రాధామోహన్ గారికి డబ్బులు రావాలని, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నారా రోహిత్ ఆకాంక్షించారు. అదే సమయంలో సినిమా జర్నీలో తన క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ ను కోల్పోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మూవీ లేట్ కావడానికి తన ఇంట్లో జరిగిన దురదృష్టకర సంఘటనే కారణం అని తెలిపారు నారా రోహిత్.

ఆ సమయంలో మూవీ టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారని, తనతో ఉన్నారని చెప్పారు. అది ఎలా చెప్పాలో పదాలు రావడం లేదని అన్నారు. ఆ సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే.. మనోజ్ వచ్చి ఓదార్చారు. దీంతో థ్యాంక్స్ బాబాయ్ అంటూ ప్రేమను చూపించారు రోహిత్. ఆ తర్వాత శ్రీనివాస్ కూడా వచ్చి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సినీ ప్రియులు, ఆయా హీరోల ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. బాండింగ్ అంటే అలా ఉండాలని చెబుతున్నారు. బ్రదర్స్ రిలేషన్ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. భైరవం మూవీతో సూపర్ హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News