నారా రోహిత్ అంత పెద్ద కోపిష్టి!

అవేశం వ‌స్తే ఎవ‌రూ ప‌ట్టుకోలేక‌పోయేవారు అట. ఆ స‌మ‌యంలో ఎంత‌మంది అదుపు చేయాల‌ని చూసినా? అంద‌ర్నీ నెట్టేసి దూసుకెళ్లిపోయేవాడుట‌.;

Update: 2025-06-05 17:30 GMT

యాంగర్ మేనేజ్ మెంట్ అధారంగా సందీప్ రెడ్డి వంగా `అర్జున్ రెడ్డి` చిత్రాన్ని తీసిన సంగ‌తి తెలిసిందే. అందులో హీరో కోపిస్ట్. ఎంత‌గా ప్రేమిస్తాడో..అంతే ద్వేషిస్తాడు...గొడ‌వ‌ల‌కు వెళ్తుంటాడు. యాంగ‌ర్ మేనేజ్ మెంట్ ని బేస్ చేసుకుని దానికి ఓ పాత్ర‌ను సృష్టించి ఓ గొప్ప చిత్రంగా `అర్జున్ రెడ్డి`ని మ‌లిచాడు. నిజ జీవితంలో కోపం అందిరికీ ఉంటుంది. కానీ కొంద‌రి కోపం మాత్రం పీక్స్ లో ఉంటుంది.

న‌ట‌సింహ బాల‌కృష్ణ కోప‌గించుకుంటే ఎలా ఉంటుందో తెలిసిందే. కోపం అన్న‌ది చాలా మందిలో వార‌స‌త్వ‌పు ల‌క్ష‌ణంగా ప‌రిగ‌ణిస్తారు. నారా వారి వార‌సుడు రోహిత్ కూడా పెద్ద కోపిష్టి అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని నారా రోహిత్ స్వ‌యంగా తెలిపాడు. ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ త‌న‌లో కోపం క‌ట్ట‌లు తెంచుకునేద‌ట‌. పెద్ద కోపిష్టిగా పేరు ప‌డిపోయిందిట కాలేజీలో.

అవేశం వ‌స్తే ఎవ‌రూ ప‌ట్టుకోలేక‌పోయేవారు అట. ఆ స‌మ‌యంలో ఎంత‌మంది అదుపు చేయాల‌ని చూసినా? అంద‌ర్నీ నెట్టేసి దూసుకెళ్లిపోయేవాడుట‌. చాలా కాలం పాటు ఇలాగే ఉన్నాన‌న్నాడు. అయితే ఓ ద‌శ‌లో త‌న‌లో ప‌రివ‌ర్త‌న వ‌చ్చింద‌న్నాడు. ఎలాగైనా మారాల‌ని సంక‌ల్పించి కోపం త‌గ్గించుకునే చ‌ర్య‌లు తీసుకున్న‌ట‌ల్తు తెలిపాడు. రెచ్చ గొట్టినా మౌనం వ‌హించ‌డం నేర్చుకున్నాడుట‌.

ఇలా కోపాన్ని అదుపు చేసుకోవం అన్న‌ది చిన్న విష‌యం కాద‌న్నాడు. ఎంతో మ‌నోబ‌లం ఉంటే త‌ప్ప సాధ్యం కాద‌న్నాడు. ఎంత కంట్రోల్ చేసుకోవాల‌న్నా లోప‌ల నుంచి కోపం త‌న్నుకొచ్చేస్తుందిట‌. కోపం త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ఓ అల‌వాటు ప్ర‌కారం చేస్తే సాధ్య‌మ‌వుతుందన్నాడు. కోపం అన్న‌ది చాలా అన‌ర్దాల‌కు దారి తీస్తుంద‌ని కోపం త‌గ్గించుకుంటే మ‌న‌సు...జీవితం కూడా ప్ర‌శాంతంగా ఉంటాయ‌న్నాడు.

Tags:    

Similar News