నాని ఫ్యాన్స్ వెయిటింగ్ ఓవర్
సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ రావడంలో ప్రమోషన్ కీలక పాత్ర పోషించింది. హిట్ 3 సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది.;
నేచురల్ స్టార్ నాని హిట్ 3 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ప్రాంచైజీలో వచ్చిన మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే హిట్ 3 పై అంచనాలు పెరిగాయి. హిట్ 3 లో నాని హీరోగా నటించడంతో పాటు, కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించడం వల్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను రూపొందించాడు. హిట్ 3 సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్స్ చేశారు. సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ రావడంలో ప్రమోషన్ కీలక పాత్ర పోషించింది. హిట్ 3 సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది.
హిట్ 3 సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడంతో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను థియేట్రికల్ స్క్రీనింగ్ మిస్ అయ్యారు. పిల్లలతో కలిసి వెళ్లాలని అనుకున్నా సాధ్యం కాలేదు. అందుకే హిట్ 3 సినిమాను నాని ని అభిమానించే ఒక వర్గం అయిన ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేక పోయారు. అందుకే హిట్ 3 సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు ఒక మోస్తరుగానే నమోదు అయ్యాయి అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. శైలేష్ కొలను దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన మూడు హిట్ లు కూడా హిట్ కావడంతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి హిట్ 3 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఉంది.
మే 1న థియేట్రికల్ రిలీజ్ అయిన హిట్ 3 ను సరిగ్గా నాలుగు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ తెలుగుతో పాటు హిందీ, ఇతర అన్ని సౌత్ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తోంది. నానిని అభిమానించే వారు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా తమిళ, హిందీ భాషల్లో నాని హిట్ 3 కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని, ఓటీటీలో ఈ సినిమా భారీ ఎత్తున వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడంలో ఈ సినిమాకు శ్రీనిధి శెట్టి వల్ల బజ్ క్రియేట్ అవుతోంది. కనుక హిట్ 3 సినిమా అన్ని భాషల్లోనూ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడం ఖాయం.
నాని పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో ఒక సైకో గ్యాంగ్ చేసే హత్యలను గురించి, వారిని నాని ఎలా పట్టుకున్నాడు అనే విషయాలతో కథ సాగుతుంది. నానితో పాటు శ్రీనిథి శెట్టి కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. హిట్ మొదటి రెండు కేసులతో పోల్చితే మూడో కేసు అత్యంత హింసాత్మకంగా సాగింది. శైలేష్ కొలను మేకింగ్ తీరు, స్టైల్ కూడా విభిన్నంగా మారింది అంటూ ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిట్ 3 సినిమాను థియేట్రికల్ స్క్రీనింగ్ మిస్ అయిన ప్రేక్షకులు, నాని అభిమానులు ఎప్పుడెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నాని ఫ్యాన్స్ హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ వెయిటింగ్ ఓవర్.. నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 వ్యూస్‌తో ప్రభంజనం సృష్టించేందుకు సర్వం సిద్ధం అయింది.