HIT 3 సెన్సార్ - ఈసారి A తో నాని ఊచకోత!

'హిట్' యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్తూ అర్జున్ సర్కార్ అనే పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న నాని, చాలా డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు.;

Update: 2025-04-25 06:30 GMT

ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘హిట్’ సిరీస్‌లో మూడో భాగం ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ (HIT 3: The Third Case) ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నేచుర‌ల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సిక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పోస్టర్లతోనే ఆడియన్స్ మైండ్‌లో గట్టిగా సెట్ అయిపోయింది.


'హిట్' యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్తూ అర్జున్ సర్కార్ అనే పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న నాని, చాలా డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. మొదటి రెండు భాగాలకు మించి ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ డోస్ ఎక్కువగా ఉండబోతుందని టాక్. ముఖ్యంగా ఈ సినిమాలోని బూతు పదాలు, రక్తపాతం, మానసిక ఉద్రేకాలను చూపించే సీన్లు చాలా బోల్డ్‌గా ఉండటంతో.. విడుదలకు ముందు సెన్సార్ అప్‌డేట్ పై ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. తొలుత మేకర్స్ U/A కోసం ప్రయత్నించినప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో భారీగా కట్స్ చెప్పడంతో టేకింగ్‌కు నష్టం వాటిల్లుతుందని భావించి A సర్టిఫికెట్‌కి ఒప్పుకున్నారు. మొత్తంగా ‘హిట్ 3’ చిత్రానికి A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటిస్తూ.. "సర్కార్ కోపం, హింస ఇప్పుడు సర్టిఫై అయ్యింది" అంటూ ఆసక్తికరంగా హింట్ ఇచ్చారు.

ఈ సినిమాలో 157 నిమిషాల రన్ టైం ఉండగా, మ్యూట్ చేసిన డైలాగ్స్, వయొలెంట్ విజువల్స్, సెన్సిటివ్ కంటెంట్‌కు సంబంధించిన సీన్లను కవరింగ్ చేసి, ఎమోషన్‌కి డామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2 గంటల 9 నిమిషాల నుండి వచ్చే హింసాత్మక యాక్షన్ సీక్వెన్స్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పలు సీన్లను కూడా కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ‘హిట్ 3’ ప్రమోషన్స్ కూడా వయొలెంట్ గానే కొనసాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ సెటప్, ఇంటర్వ్యూల్ స్పేస్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాని పాత్ర మీద ఎన్ని మిస్టరీలు ఉన్నా.. అర్జున్ సర్కార్ ఎంట్రీ మాత్రం థియేటర్లలో భారీ ఊపు తీసుకురానుందని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.

రైటింగ్, టేకింగ్, యాక్షన్, సంగీతం.. ఇలా అన్ని విభాగాల్లోనూ అగ్రస్థాయి టీమ్ పని చేసిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, వాల్ పోస్టర్ సినిమాస్, యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిసి భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇక మే 1వ తేదీన థియేటర్లలోకి రానున్న 'హిట్ 3' ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News