అక్కినేని అభిమానులు అసంతృప్తిగానే!
`కుబేర` తో కింగ్ నాగార్జున టాలీవుడ్ లో కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారి దీపక్ పాత్రలో మెప్పించారు.;
`కుబేర` తో కింగ్ నాగార్జున టాలీవుడ్ లో కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారి దీపక్ పాత్రలో మెప్పించారు. దీపక్ పాత్రలో రెండు పార్శ్యాలుంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కోణాల్ని ఆవిష్కరించారు. అంతిమంగా ఆ పాత్ర ను పాజిటివ్ గానే ముగించినా? అక్కినేని అభిమానులకు ఆ పాత్ర పరంగా ఎక్కడో చిన్న అసంతృప్తి వెంటాడింది. క్లైమాక్స్ లో దీపక్ పాత్ర చనిపోవడం వంటి సన్నివేశం అక్కినేని అభిమానుల్ని సంతృప్తి పరచలేదు. సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రకే పరిమతం అవ్వడం అన్నది ఓ సెక్షన్ ఆడియన్స్ లో అసంతృప్తి కనిపించింది.
ఊరటనిచ్చిన వసూళ్లు:
సాధారణంగా మరో స్టార్ సినిమాలో నాగార్జున లాంటి అగ్ర స్థాయి నటుడు కీలక పాత్ర అంటే? ఈ రకమైన అసంతృప్తి సహజమే. నటుడిగా నాగార్జున మనస్పూర్తిగా ఇష్టపడి ఆ పాత్ర పోషించినా హీరో కాదు అనే భావన అభిమానుల్ని తొలిచిన మాట వాస్తవం. అయితే `కుబేర` హిట్ అవ్వడం తో అంతగా నెగి విటీకి దారి తీయలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అన్నది అభిమానులకు ఊరట నిచ్చింది. నాగార్జున కెరీర్ లో అంత వరకూ వంద కోట్ల వసూళ్ల సినిమా ఒకటీ లేకపోవడం వంటింది కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు.
ముందే విలన్ గా:
అదే సినిమా ఫలితం తారుమారైతే? అక్కినేని అభిమానులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉండేది. అలా `కుబేర`` విషయంలో లోలోపల చిన్నపాటి అసంతృప్తి ఉన్నా పంటికింద బాధ లా నొక్కి పెట్టారు. ఇక పాన్ ఇండియా చిత్రం `కూలీ`లో విలన్ గానూ నాగ్ నటించిన సంగతి తెలిసిందే. సైమన్ పాత్రలో మెప్పించారు. రజనీ కాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లతో కలిసి నాగార్జున సిని మాలో కీలక పాత్ర ధారిగా మారారు. ఇందులో నాగ్ నేరుగా విలన్ అని ముందే రివీల్ చేసేసారు.
సైమన్ 2.0 లేనట్లే:
కాబట్టి నాగ్ అభిమానుల ముందుకు ఓ క్లారిటీతోనే వచ్చారు. ఈ పాత్రను నాగ్ ఎంతో ఇష్టపడి చేసారు. రజనీకాంతే ఆ పాత్ర తానే చేస్తే బాగుండేదని అభిప్రాయ పడటంతో? అదంత గొప్ప రోల్ అని? అక్కినేని అభిమానుల్లో ఒకటే హైప్ క్రియేట్ అయింది. కానీ కూలీ ఫలితం రూపంలో అభిమానుల్ని నిరాశ పరిం చింది. సినిమా బ్లాక్ బస్టర్ అయితే గనుక నాగ్ లో సైమన్ 2.0ని చూసే అవకాశం ఉంటుందని పరిశ్రమ భావించింది. కానీ ప్రతికూల ఫలితం ఆలోచనలో పడేసింది. మరి ఈ రకమైన ఫలితాలు నాగ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తాయో చూడాలి.