నాగబంధం కోసం అదిరిపోయేలా మరో ప్లాన్
ప్రసాద్స్ పీసీఎక్స్ లాంటి పెద్ద స్క్రీన్ పై భారీ ఎత్తున ఫ్యాన్స్ మధ్య ఈవెంట్ చేయడం ద్వారా సినిమా చుట్టూ ఒక్కసారిగా బజ్ క్రియేట్ అవుతుంది.
టాలీవుడ్ లో మైథలాజికల్ ఫాంటసీ మూవీస్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ లో దమ్ముంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. సరిగ్గా ఇదే ఫార్ములాతో వస్తున్న లేటెస్ట్ మూవీ నాగబంధం. జూలై 3వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రసాద్స్ పీసీఎక్స్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.
మామూలుగా ఇలాంటి భారీ విజువల్స్ ఉన్న సినిమాలకు పెద్ద స్క్రీన్ మీద ట్రైలర్ లాంచ్ చేయడం ఒక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ప్రసాద్స్ పీసీఎక్స్ లాంటి పెద్ద స్క్రీన్ పై భారీ ఎత్తున ఫ్యాన్స్ మధ్య ఈవెంట్ చేయడం ద్వారా సినిమా చుట్టూ ఒక్కసారిగా బజ్ క్రియేట్ అవుతుంది. దర్శకుడు అభిషేక్ నామా తాను తీసిన అవుట్ పుట్ మీద ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్ తోనే ట్రైలర్ ఈవెంట్ ను ఇంత గ్రాండ్ గా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.
రిలీజ్ కు సరిగ్గా 14 రోజుల ముందు ఈ రేంజ్ లో బజ్ తీసుకురావడం అడ్వాన్స్ బుకింగ్స్ కు చాలా ప్లస్ అవుతుంది. కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా 1750ల నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే సాలిడ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. గుళ్లలో దాగి ఉన్న రహస్యాలను, దేశ సంపదను కాపాడే శివుని అంశతో సాగే కథ కావడంతో నేటి జనరేషన్ కు సులువుగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పోస్టర్స్ లో శివుని త్రిశూలం, పాములు లాంటి డిటైలింగ్ చూస్తుంటే టెక్నికల్ గా విజువల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని టాక్.
ఇలాంటి దైవిక శక్తుల కథలు స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయితే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ దొరుకుతుంది. ఇక క్యాస్టింగ్ విషయంలో కూడా మేకర్స్ చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లారు. యంగ్ హీరో విరాట్ కర్ణ తన రెండో సినిమాకే ఇలాంటి పాన్ ఇండియా సబ్జెక్టును ధైర్యంగా ఎంచుకోవడం హైలెట్. అతనికి సపోర్ట్ గా సీనియర్ నటుడు జగపతి బాబు కీ రోల్ చేస్తుండటం సినిమాకు వెయిట్ తీసుకొచ్చింది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లాంటి గ్లామర్ తారాగణంతో పాటు రీసెంట్ గా వచ్చిన సుర సుర ఫోక్ సాంగ్ మాస్ ఆడియన్స్ లో ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ తీసుకువచ్చింది. నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచారని పోస్టర్స్ లోని ఆర్ట్ వర్క్ చూస్తేనే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ సోలో రిలీజ్. జూలై 3వ తేదీన వేరే పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో ఇప్పుడు రాబోయే ట్రైలర్ గనక అంచనాలకు తగ్గట్లుగా ఉంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.