జిమ్ లో తెగ కష్టపడిపోతున్న నభా నటేష్.. స్పెషల్ ఏంటంటే?

ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తాజాగా తన వారం మొత్తానికి సంబంధించిన జిమ్ వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంది.;

Update: 2025-10-27 14:54 GMT

సాధారణంగా పురుషులతో పోల్చుకుంటే మహిళలు త్వరగా ఏజ్ ఉన్నవారిగా కనిపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వివాహం తర్వాత గర్భం.. ఆ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు.. పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాలవల్ల అమ్మాయిల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ హీరోయిన్స్ ని చూస్తే మాత్రం 50 ఏళ్లు కాదు కదా 70 ఏళ్లు వచ్చినా సరే ఇంకా యంగ్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అసలు వీరి ఫిట్నెస్ వెనుక రహస్యం ఏంటి అని అమ్మాయిలు వెతకడం ఆరంభిస్తారు అనడంలో సందేహం లేదు.

అయితే హీరోయిన్స్ లేటు వయసులో కూడా అంత అందంగా కనిపించడానికి కారణం వారు తీసుకునే డైట్ మాత్రమే కాదు జిమ్ సెంటర్లలో వారు కష్టపడే తీరు కూడా వారిని బొమ్మలా మారుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అందుకే నిత్యం జిమ్ సెంటర్లలో కనిపిస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటున్నారు. అంతేకాదు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తగిన యోగా శిక్షణలు కూడా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటు మానసికంగా అటు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీరం ఫిట్ గా ఉంటుందని.. వయసు మీద పడినా.. అసలు తెలియదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలా నిత్యం తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు

ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తాజాగా తన వారం మొత్తానికి సంబంధించిన జిమ్ వీడియోని అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఈ జిమ్ వీడియోలో స్పెషల్ ఏంటో కూడా క్యాప్షన్ లో జోడించింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. సోమవారం నుంచి ఆదివారం వరకు జిమ్లో గడిపిన రోజుకు ఒక ఫోటో తీసుకుంది. వాటన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఒక్కొక్క ఫోటోలో సెల్ఫీ ఫోటో తోపాటు రంగురంగుల జిమ్ దుస్తులు ధరించి తన వస్త్రాలతో కూడా అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి అయితే జియో లో కష్టపడుతూనే అటు రోజుకొక ఫోటో షేర్ చేస్తూ రోజుకు ఒక రంగు డ్రెస్ ధరించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నభా నటేష్ కెరియర్ విషయానికి వస్తే.. గత రెండు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ బారిన పడిన ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అందులో భాగంగానే తాజా నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది . భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో నభా నటేష్ సక్సెస్ అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News