పొట్టి డ్రెస్ లో నభా అందాలు..

ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి.. అందాలు ఆరబోస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.;

Update: 2025-12-29 11:22 GMT

ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో అవకాశాలు అందుకొని.. సడన్గా అవకాశాలు తగ్గిపోయి మళ్లీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ లో నభా నటేష్ కూడా ఒకరు. ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురుచూడడంలో భాగంగానే సోషల్ మీడియా వేదికగా అందాలు వలకబోస్తూ అభిమానులను అటు దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి.. అందాలు ఆరబోస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. బ్లాక్ కలర్ మినీ టాప్ అండ్ షార్ట్ తో నడుము అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో మంట రాజేస్తున్నాయి.



 


మొత్తానికైతే ఈ మధ్యకాలంలో గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నభా నటేష్ మరోసారి తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా నభాకి అవకాశాలు వస్తాయేమో చూడాలి. నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. సుధీర్ బాబు హీరో గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.



 


2018లో వచ్చిన ఈ సినిమా కంటే ముందే కొన్ని కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇందులో తన అందంతో నటనతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా డిస్కో రాజా, అదుగో, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో ఇలా తదితర సినిమాలలో నటించి అభినయంతో మంచి మార్కులు వేయించుకుంది.



 


ఈ సినిమాలు ఈమెకు అవకాశం ఇచ్చినా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో సక్సెస్ అయితే అందించలేదు. ఆ తర్వాత మధ్యలో యాక్సిడెంట్ అవ్వడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ తిరిగి కోలుకొని సినిమాలు చేస్తోంది. అందులో భాగంగానే నిఖిల్ స్వయంభూ సినిమాలో నటిస్తోంది. ఇందులో అదిరిపోయే పాత్రలో నటిస్తున్నట్లు ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా ఈమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక నభా చేతిలో ఈ సినిమా తప్ప మరో సినిమా లేదు.



 


ప్రస్తుతం గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు జిమ్లో నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోంది నభా నటేష్. ఇదిలా ఉండగా మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె యాక్సిడెంట్ తర్వాత వర్కౌట్స్ చేయడాన్ని మరింత ఇష్టపడుతున్నాను అంటూ తెలిపింది. శరీరంపై అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజులు, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటివి ఎక్కువగా చేస్తున్నాను. యాక్సిడెంట్ కి ముందు హీరోయిన్ కాబట్టి ఏదో చేస్తున్నా అనేటట్టు ఉండేదాన్ని.. కానీ ఇప్పుడు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది అంటూ తెలిపింది నభా నటేష్.

Tags:    

Similar News