స‌ల్మాన్ ఖాన్ కి ముర‌గ‌దాస్ దూర‌మైన‌ట్లేనా!

ఇటీవలే 'సికింద‌ర్' ప‌రాజయాన్ని ఉద్దేశించి స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-08-19 07:12 GMT

ఇటీవలే 'సికింద‌ర్' ప‌రాజయాన్ని ఉద్దేశించి స్టార్ డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగతి తెలిసిందే. త‌న క‌థ‌ను మార్చేసార‌ని..ముంబైలో త‌న క‌మాండింగ్ యూనిట్ లేద‌ని...ఉద‌యం 8 గంటల‌కు రావాల్సిన హీరో సాయంత్రం 8 గంట‌ల‌కు రావ‌డం..ఇలాంటి కార‌ణాలుగా సినిమా ప్లాప్ అయితే దానికి తానెందుకు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. ఇంత వ‌ర‌కూ ముర‌గ‌దాస్ తాను తీసిన ..ప‌ని చేసిన ఏ హీరో విష‌యంలో ఇలా స్పందించ‌లేదు. తొలిసారి ఆయ‌న నోట ఇలాంటి వ్యాఖ్య‌లు రావడంతో ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారంతా.

మ‌ళ్లీ క‌ల‌వ‌డం క‌ష్ట‌మే:

ఎప్పుడూ స‌హ‌నంగా ఉండే ముర‌గ‌దాస్ ఇలా రివ‌ర్స్ అయ్యా రేంట‌ని సర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అజిత్, విజ‌య్ కాంత్, చిరంజీవి , అమీర్ ఖాన్, సూర్య‌, విజ‌య్, మ‌హేష్‌, ర‌జ‌నీకాంత్ ఇలా ఎంతో మంది స్టార్ల‌తో సినిమాలు చేసారు. ఏ హీరోతోనూ ముర‌గదాస్ కి ఎలాంటి స‌మ‌స్య త‌లెత్త‌లేదు. వీరిపై ఏనాడు చిన్న పాటి విమ‌ర్శ కూడా ప‌రోక్షంగా చేయ‌లేదు. అలాంటిది 'సికింద‌ర్' విష‌యంలో ముర‌గ‌దాస్ వైలెంట్ రియా క్ష‌న్ తో ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని తెలియ‌జేస్తోంది. భ‌విష్య‌త్ లో ఇద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌డం సందేహ‌మే అంటూ నెట్టింట చ‌ర్చ సాగుతోంది.

రాజీ ప‌డాల్సిన ప‌రిస్థితి:

'సికింద‌ర్' చిత్రాన్ని బాలీవుడ్ లో న‌డియా వాలా గ్రాండ్ సన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్-స‌ల్మాన్ ఖాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణంలో ముర‌గ‌దాస్ ఎలాంటి భాగ‌స్వామ్యం క‌ల్పించు కోలేదు. కేవ‌లం ద‌ర్శ‌కుడిగా మాత్ర‌మే ప‌ని చేసారు. ఆ ప‌ని కూడా స్వేచ్ఛ‌గా చేయ‌న‌ట్లు ముర‌గ‌దాస్ మాట్ల లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. క‌థ‌లో హిందీ రైట‌ర్లు వేళ్లు పెట్టిన‌ట్లు... చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌న క‌మాండింగ్ టీమ్ లేక‌పోవ‌డం వంటి ప‌రిస్థితులతో చివ‌ర‌కు ముర‌గ‌దాస్ కూడా రాజీ ప‌డాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

తాత్కాలిక‌మా? శాశ్వ‌త‌మా?

ఎన్న‌డు రాజీ ప‌డ‌ని ముర‌గ‌దాస్ ఈ సినిమా కోసం రాజీ ప‌డిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏ హీరో నిర్మాణ సంస్థ‌లోనైనా హీరో ప్ర‌మేయం లేకుండా ఇలాంటివి జ‌ర‌గ‌వు అన్న‌ది అగ్ర నిర్మాణ సంస్థ‌లు చెబుతున్న మాట‌. గ‌తంలోనూ ముర‌గ‌దాస్ అమీర్ ఖాన్, అక్ష‌య్ కుమార్ లాంటి స్టార్లతో హిందీ సినిమాల‌కు ప‌ని చేసారు. వాళ్ల‌తో ముర‌గ‌దాస్ కు పూర్తి స్వేచ్ఛ ల‌భించింది. కానీ స‌ల్మాన్ ఖాన్ తో అదో కొర‌వ‌డిన‌ట్లు ముర‌గ‌దాస్ మాట‌ల్లో అర్ద‌మ‌వుతోంది. మ‌రి ఈ ప‌రిస్థితులు ముర‌గ‌దాస్ ని స‌ల్మాన్ ఖాన్ కి దూరం చేయడం అన్న‌ది తాత్కాలిక‌మా? శాశ్వ‌త‌మా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.

Tags:    

Similar News