ఆ సమయంలో మృణాల్‌ స్వీయ నిర్భందం

తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌.;

Update: 2025-06-30 15:30 GMT

తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు చేస్తోంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో ఈమె నటిస్తున్న డెకాయిట్‌ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడవి శేష్‌ హీరోగా రూపొందుతున్న ఆ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈమె అల్లు అర్జున్‌ సినిమాలో ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాతోనూ మృణాల్‌ ఠాకూర్ రాబోతుంది. మెయిన్‌ హీరోయిన్‌గా దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుండగా, కీలక పాత్రలో మృణాల్‌ ఠాకూర్ కనిపించబోతుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. గతంలో కాస్త లావుగా, బొద్దుగా ఉన్న మృణాల్‌ ఠాకూర్ ఇప్పుడు సన్నగా నాజూకుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తుందని మృణాల్‌ ఠాకూర్ చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వర్కౌట్స్, డైట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను డైట్‌ చేసేందుకు చాలా కష్టపడుతాను అంది. అంతే కాకుండా తనకు తాను చాలా కండీషన్స్ పెట్టుకుంటాను అంది.

ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఇష్టమైన వంట చేస్తున్న సమయంలో నన్ను నేను రూమ్‌లో నిర్భందించుకుంటాను. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్‌ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతాను అని గట్టిగా నవ్వేసింది. మృణాల్‌ మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ అందం కాపాడుకోవడం కోసం, బరువు పెరగకుండా ఉండటం కోసం ఇష్టమైన ఆహారం తీసుకోకుండా దూరంగా ఉంటారు. మృణాల్‌ ఠాకూర్ ఇష్టమైన ఆహారంకు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా ప్రతి రోజు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. జిమ్‌లో ఈమె చేసే వర్కౌట్‌ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉంటాం.

ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ నటించిన 'సన్నాఫ్ సర్ధార్‌ 2' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అజయ్ దేవగన్‌ హీరోగా నటించిన ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మృణాల్‌ బాలీవుడ్‌లో ఇప్పటి వరకు సాలిడ్‌ విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమాతో ఆ లోటును భర్తీ చేస్తుందా అనేది చూడాలి. తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఎక్కువగా నార్త్‌ సినిమాల్లో నటించాలని ఈమె కోరుకుంటుంది. బాలీవుడ్‌లో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినా కూడా రాని గుర్తింపు టాలీవుడ్‌లో తక్కువ సమయంకే వచ్చింది. అయినా బాలీవుడ్‌ పైనే ఈమెకు మక్కువ అని కొందరు అంటూ ఉంటారు. మృణాల్‌ మాత్రం తనకు అన్ని భాషల్లో నటించాలని ఉంటుంది, నటనకు ఆస్కారం ఉన్న ప్రతి పాత్రను చేసేందుకు తాను రెడీ అన్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News