• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిస్టర్ బచ్చన్ విమర్శలు...

మిస్టర్ బచ్చన్ విమర్శలు వస్తున్నా డోంట్ కేర్!

| కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ నే ఎంచుకుంటూ తనదైన శైలిలో అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-01 02:30 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ నే ఎంచుకుంటూ తనదైన శైలిలో అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. హరీష్, రవితేజ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, సాంగ్స్.. వాటిని మరింత పెంచాయి. కచ్చితంగా మూవీ చూడాలనిపించేంతగా హైప్ సృష్టించాయి. ఇక ఈ సినిమాతో పుణె సుందరి టాలీవుడ్ లోకి వస్తోంది.

మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న భాగ్య శ్రీ బొర్సే.. ఇప్పటికే యారియన్-2 మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది. పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. దీంతో వారిద్దరి సాలిడ్ కెమిస్ట్రీకి ప్రశంసలు లభిస్తున్నాయి.

అదే సమయంలో కొందరు.. భాగ్యశ్రీ వయసును ప్రస్తావిస్తున్నారు. 25 ఏళ్ల ఆమె.. తనకంటూ రెట్టింపు ఏజ్ ఉన్న హీరోతో రొమాన్స్ చేయడం ఏం బాలేదని చెబుతున్నారు. రొమాన్స్ లో పల్స్ మిస్ అవుతుందని అంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ మిస్టర్ బచ్చన్ మేకర్స్.. ఆ విషయాన్ని పట్టించుకోనట్లు కనిపిస్తుంది. వారి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఉండే కొత్త పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

జిక్కీ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. రొమాంటిక్ పోస్టర్ ను షేర్ చేశారు. అందులో హీరోయిన్ ను హత్తుకుని రవితేజ నడుముపై ముద్దు పెట్టిన స్టిల్ సూపర్ గా ఉంది. దీంతో రవితేజ అభిమానులు... ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టినా మూవీ సూపర్ హిట్ పక్కా అని చెబుతున్నారు. కావాలనే కొందరు హీరోయిన్ ఏజ్ ను ప్రసావిస్తూ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మరి మూవీ రిలీజ్ అయ్యాక రవితేజ, భాగ్యశ్రీ కెమిస్ట్రీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • filmindustry 
  • MrBachchan 
  • Raviteja 
  • BhagyashreeBorse 
  • Harishshankar 
  • Announcement 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS