మ‌ళ్లీ మూడేళ్ల‌కు శ్రీహ‌రి వార‌సుడు!

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా మేఘాంష్ తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-04-05 11:30 GMT

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా మేఘాంష్ తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.రాజ్ దుత్ చిత్రంతో తొలిసారి మ్యాక‌ప్ వేసుకున్నాడు. ఆ సినిమాకు మిశ్ర‌మ ఫ‌లితాలొచ్చాయి. కానీఈజ్ న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ వెంట‌నే కొత్త అవ‌కాశాలు అందుకోవంలో మాత్రం వెనుక‌బ‌డ్డాడు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం కోతి కొమ్మ‌చ్చి, మిస్ట‌ర్ బ్ర‌హ్మా ఏంటీ డ్రామా లాంటి సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ అవి అఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో మ‌ళ్లీ మూడేళ్ల గ్యాప్ త‌ప్ప‌లేదు. తాజాగా మేఘాంశ్ హీరోగా ఆస్మ‌న్ అనే చిత్రం నిన్న‌టి రోజున ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.




ఆ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున యువ హీరోలు అటెండ్ అయ్యారు. ఆర‌కంగా మేఘాంష్ కు మంచి స‌పోర్ట్ ల‌భించింది. కానీ అంతిమంగా సినిమా హిట్ మాత్ర‌మే ఇండ‌స్ట్రీలో ముందుకు తీసుకెళ్ల‌గ‌ల్ల‌దు. మేఘాంష్ ప్ర‌స్తుతం ఉన్న స‌న్నివేశంలో హిట్ ప‌డితే? త‌ప్ప న‌టుడిగా బిజీ అవ్వ‌డం క‌ష్టం. ఆస్మాన్ కోసం మేఘాంశ్ లుక్ ,నటన పరంగా చాలా మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథాంశం, మేఘాంశ్ పాత్ర చిత్రణ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. కేవలం తండ్రి ఇమేజ్‌ను నమ్ముకోకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల మేఘాంశ్ లో క‌నిపిస్తుంది.




అందుకే గ్యాప్ వ‌చ్చినా? కొత్త ప్రాజెక్ట్ ను లాంచ్ చేయ‌గ‌ల్గుతున్నాడు. చాలాసార్లు క‌థ‌ల ఎంపిక‌లోనే న‌టులు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటారు. కంగారు ప‌డి క‌మిట్ అయిన క‌థ‌లు కెరీర్ నే డైల‌మాలో ప‌డేస్తుంటాయి.ఇవ‌న్నీ విశ్లేషించుకునే మేఘాంష్ కొత్త సినిమా విషయంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమా తో మేఘాంష్ తనలోని అసలైన నటుడిని బయటకు తీయాల‌నే క‌సితో ఉన్నాడు. ఈ మూడేళ్ల నిరీక్షణకు ఈ సినిమా సరైన సమాధానం చెబుతుందని గట్టిగా నమ్ముతున్నాడు. మ‌రి ఆన‌మ్మ‌కం నిల‌బ‌డుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌కు, వైవిధ్యమైన కథలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆస్మాన్ మేఘాంశ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని ఆశిద్దాం. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల‌ని మేఘాం ష్ సంక‌ల్పిచ‌డం అన్న‌ది గొప్ప ప్ర‌య‌త్నం. సాధార‌ణంగా ఇండ‌స్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేక‌పోతో ఎంట్రీనే క‌ష్స‌ట‌మ‌వుతుంది. అందులోనూ మేఘాంష్ డాడ్ దివంగ‌తులైన త‌ర్వ‌త లాంచ్ అయ్యాడు. తాను చేసిన మూడు సినిమాల్ని తానే స్వ‌యంగా సెట్ చేసుకున్నాడు. శ్రీహ‌రి కూడా ఇండ‌స్ట్రీకి అలా వ‌చ్చి ఎదిగిన న‌టుడే కాబ‌ట్టి తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల‌ని మేఘాంష్ గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Tags:    

Similar News