• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ మెగాస్టార్.. ఇక్కడ...

అక్కడ మెగాస్టార్.. ఇక్కడ మెగాస్టార్ కొడుకు

| ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By - Tupaki Desk
Update: 2024-02-19 10:42 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో వరుణ్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 1వ ఈ సినిమా విడుదల సందర్భంగా మేకర్స్.. ట్రైలర్ తో రెడీ అయిపోయారు.


ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫైనల్ స్ట్రైక్.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ట్రైలర్ ను బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చేతులు మీదుగా.. రేపు ఉదయం 11.05 గంటలకు లాంఛ్ చేయనున్నారు మేకర్స్.


అదే సమయంలో తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. “ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నుంచి ఫైనల్ స్ట్రైక్‍ ను గ్లోబల్ స్టార్ రామ్‍ చరణ్, భాయ్ సల్మాన్ ఖాన్ రేపు ఉదయం 11:05 గంటలకు లాంఛ్ చేస్తారు” అని మూవీ బ్యానర్ రినైసెన్స్ పిక్చర్స్ ఎక్స్ లో ట్వీట్ చేసింది.

ఇండియా పై ఉగ్ర దాడికి పాల్పడ్డ వేరే దేశంపై భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కొన్ని యధార్థ ఘటనలను తీసుకుని మూవీని తీసినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా వరుణ్, రాడార్ ఆఫీసర్ గా మానుషి చిల్లర్ కనిపించనున్నారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు వరుణ్ తేజ్. అంతకుముందు వందేమాతరం సాంగ్ ను ఆర్మీ అధికారుల సమక్షంలో విడుదల చేశారు.

ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో వరుణ్, మానుషి చిల్లర్‌తో పాటు హీరో నవదీప్, హీరోయిన్ రుహానీ శర్మ, మీర్ సర్వర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీతోనే శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మిక్కీ.జె. మేయర్ ఈ చిత్రానికి బాణీలు కట్టారు.

Whose votes will YS Sharmila split?#YSSharmila #CongressParty #YSRCP #TDPJanasena #AndhraPradesh #Tupaki

— Tupaki (@tupaki_official) February 19, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Operationvalentine 
  • Varuntej 
  • Manushichhillar 
  • Salmankhan 
  • Ramcharan 
  • Shaktipratapsingh 
  • Sonypictures 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS