సంక్రాంతి సెంటిమెంట్.. హ్యాట్రిక్ అందుకుంటుందా?

అంతేకాదు గత రెండు సంక్రాంతి సినిమాలు, వాటి ఫలితాలు చూస్తే మాత్రం నిజంగా మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ గా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.;

Update: 2025-12-31 18:30 GMT

ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో, అమాయకత్వంతో అందరి హృదయాలు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె సంక్రాంతిని సెంటిమెంట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు గత రెండు సంక్రాంతి సినిమాలు, వాటి ఫలితాలు చూస్తే మాత్రం నిజంగా మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ గా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.

2024లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో దిగి సక్సెస్ సాధించింది. ఇటు అనిల్ రావిపూడి , వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనూ పాత్రలో నటించింది మీనాక్షి చౌదరి . ఈ సినిమా కూడా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది . అంతేకాదు ప్రాంతీయంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాతో మీనాక్షి చౌదరికి ఆఫర్లు కూడా వరుసగా తలుపు తడుతున్నాయి.

అలా తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రెండుసార్లు సంక్రాంతి రేసులో దిగి మంచి విజయాలను అందుకున్న మీనాక్షి చౌదరి.. మళ్లీ సంక్రాంతి సెంటిమెంటును రిపీట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అనగనగా ఒక రాజుతో సక్సెస్ కొట్టాలని చూస్తోంది. ఒకవేళ ఈ సినిమా గనుక మంచి విజయం సాధించిందంటే.. మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ కావడమే కాకుండా ప్రతి ఏడాది సంక్రాంతికి సినిమా చేసి హ్యాట్రిక్ అందుకున్న తొలి హీరోయిన్గా కూడా రికార్డు సృష్టిస్తుందనటంలో సందేహం లేదు. మరి మీనాక్షి చౌదరికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనగనగా ఒక రాజు చిత్రంలోని భీమవరం బాల్మా, రాజుగారి పెళ్లిరో అనే పాటలకు వేదికపై అదిరిపోయే డాన్స్ చేసి అందరిలో ఉత్సాహం నింపారు.. ఇకపోతే ఈ ఈవెంట్లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. " ఇది నా మూడో సంక్రాంతి సినిమా. అనగనగా ఒక రాజులో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.. కచ్చితంగా ఈ సినిమాపై ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నాను. 2026 జనవరి 14న థియేటర్లలో కలుద్దాం" అంటూ తెలిపింది మీనాక్షి చౌదరి.. అటు మీనాక్షి చౌదరి ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషకర్మ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది.

Tags:    

Similar News