• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో టర్నెడ్ కమెడియన్.....

హీరో టర్నెడ్ కమెడియన్.. మస్తు షేడ్స్ చూపించేందుకు రెడీ..!

| కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తిరుపతి రావు డైరెక్షన్ లో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఫస్ట్ లుక్ పోస్టర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-01-29 12:28 GMT

ఈమధ్య కాలంలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ మెప్పిస్తున్న అభినవ్ గోమఠం ఈ నగరానికి ఏమైంది. మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ సినిమాల్లో అలరించాడు. కమెడియన్ గా తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకున్న అభినవ్ గోమఠం హీరోగా మారి చేస్తున్న సినిమా మస్తు షేడ్స్ ఉన్నయ్ రా.. తన సూపర్ హిట్ డైలాగ్ నే టైటిల్ గా చేసుకుంటూ సినిమా చేస్తున్నాడు అభినవ్ గోమఠం. ఈ సినిమాలో వైశాలి రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.


కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో తిరుపతి రావు డైరెక్షన్ లో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఫస్ట్ లుక్ పోస్టర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమఠం లోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారని అన్నారు. అన్ని భావోద్వేగాల ఈ సినిమాలో ఉంటాయి. లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. కొత్తదనంతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని అన్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అలీ రెజా, మెయిన్, తదితరులు నటిస్తున్నారు. సినిమాకు సిద్ధార్థ్ స్వయంభూ సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. అన్వర్ సాధిక్ కథ అందించారు. ఈ సినిమాకు సంగీతం సంజీవ్ టి అందిస్తున్నారు.

అభినవ్ గోమఠం కేవలం కమెడియన్ గానే కాదు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా మెప్పించారు. ఆడియన్స్ లో అతని పై ఉన్న పాపులారిటీనే అతన్ని హీరో చేసిందని చెప్పొచ్చు. హీరోగా తొలి సినిమా కూడా అతని పాపులర్ డైలాగ్ తో రావడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.


Tags:    
  • Abhinavgomatam 
  • Movie 
  • Newmovie 
  • Masthushadeunnaira 
  • Firstlook 
  • Comedian 
  • Actor 
  • Tollywood 
  • Thirupathirao 
  • Bhavanikasula 
  • Aaremreddy 
  • Prashanthv 
  • Kasulacreativeworks 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS