నవ్వుకే పడిపోయి పెళ్లి చేసుకున్నా!
మంచు విష్ణు-వెరోనికా ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. భర్త సక్సెస్ లో భార్య సగ భాగమంటున్నారు.;
మంచు విష్ణు-వెరోనికా ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. భర్త సక్సెస్ లో భార్య సగ భాగమంటున్నారు. విష్ణు ప్రతీ సక్సెస్ లోనూ వెరోనికా ఉన్నారు. అన్నిరకాలుగా విష్ణుకు భార్య నుంచి మంచి మద్దతు లభిస్తుంటుంది. వెరోనికా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాదు. చాలా రేర్ గానే ఆమె సినిమా ఈవెంట్లలో కనిపిస్తుంటారు. తాజాగా భార్య వెరోనికా గురించి విష్ణు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
`వెరోనికాకు దేశ విదేశాల్లో బోటిక్ లున్నాయి. మొదటి సారి ఆమెను చూసి నప్పుడు ఆమె నవ్వుకే పడిపోయాను. తనే నా జీవిత భాగస్వామి కావాలనుకున్నా. మా పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ దారి తీసిం ది. నలుగురు పిల్లల బాధ్యత, వ్యాపార లావాదేవీలు, ఇతర పనులతో తను చాలా బిజీగా ఉంటుంది. ఇంత బిజీగా ఉన్నా నా పర్సనల్ స్టైలిష్ గా వ్యవహరిస్తుంది` అన్నారు. దీంతో విష్ణు డ్రెస్సింగ్ సెన్స్ వెనుక అసలు గుట్టు ఇప్పుడు వీడినట్లు అయింది.
విష్ణు అప్పుడప్పుడు డిజైనర్ దుస్తుల్లో స్టైలిష్ గా మెరుస్తుంటాడు. టాలీవుడ్ లో ఏ హీరో కూడా అలా ముస్తా బవ్వడు. కానీ విష్ణు మాత్రం అందరికీ భిన్నంగా స్టైలిష్ గా కనిపిస్తాడు. రెగ్యులర్ డిజైన్స్ పక్కన బెడితే సినిమా ఈవెంట్లకు హాజరైన సమయంలో విష్ణు సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంటాడు.
కెమెరా కళ్లన్నీ ఆయనపైనే ఉంటాయి. అలాగే విష్ణు పార్టీలకు దూరంగా ఉంటాడు. ఖాళీ సమయం దొరికితే ఇంట్లో పిల్లలు, కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడుట. వాళ్లతో ఆట పాటు, టీవీ చూడటం చేస్తుం టాడుట. అలా ఒత్తిడిని నుంచి కూడా ఉపశమనం పొందుతానన్నాడు. విష్ణు తొలుత హనుమంతుడు భక్తుడు అట. అయితే కన్నప్ప మొదలైన తర్వాత పరమేశ్వరుడుని ఆరాధించడం మొదలు పెట్టినట్లు తెలిపాడు.