పండగ వైబ్ మొత్తం రాజా సాబ్ భామలదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ది రాజా సాబ్.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజా సాబ్ భారీ అంచనాలతో రిలీజై, అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రాజా సాబ్ ఫ్లాపుగా మిగిలింది. సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.
ఈ రోజుతో సంక్రాంతి పండుగ అయిపోతుంది. బాక్సాఫీస్ వద్ద రాజా సాబ్ హడావిడి పెద్దగా కనిపించడం లేదు. రాజా సాబ్ సినిమా గురించి ఆడియన్స్ ఆలోచించడం దాదాపు మానేశారు. అయినప్పటికీ ఈ పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. దానికి కారణం అందులో నటించిన హీరోయిన్లు. సంక్రాంతి సందర్భంగా రాజా సాబ్ హీరోయిన్లు ముస్తాబైన తీరు అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.
అందులో భాగంగానే మాళవిక పండుగను పురస్కరించుకుని తయారైన విధం అందరినీ కట్టి పడేస్తుంది. రెడ్ కలర్ శారీ ధరించి, దానికి మ్యాచింగ్ జ్యుయలరీ ధరించి, ఎంతో అందంగా కనిపించగా, ఎర్ర రంగు చీరలో మాళవిక మరింత అందంగా ఉందని నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు. రాజా సాబ్ లో జెస్సీగా కనిపించిన నిధి అగర్వాల్ కూడా చాలా భిన్నమైన లుక్ లో కనిపించింది.
బ్లూ కలర్ శారీ, దాని బోర్డర్ కు ఎంబ్రాయిడరీ సింపుల్ ఇయర్ రింగ్స్ ధరించి కనిపించారు. ఈ శారీ లుక్ లో కూడా నిధి తన అందాలను ఆరబోస్తూ, నవ్వులను పూయిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. నిధి పండగ స్పెషల్ కు ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా రెడీ అయి అందరినీ తన అందాలతో ఆకట్టుకుంటుండగా రిద్ధి కుమార్ ఫ్లోరల్ ఔట్‌ఫిట్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. మొత్తానికి పండగ సందర్భంగా రిలీజైన రాజా సాబ్ అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయినా, అందులో నటించిన ముగ్గురు బ్యూటీలు మాత్రం అన్ని విధాలా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.