ఫ్లాట్ అమ్మి 3 కోట్లకు రేంజ్ రోవర్ కొనుక్కున్న నటి
చాలామంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు.;
చాలామంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అమితాబ్ లాంటి అగ్ర కథానాయకుడు నాలుగేళ్లలో 50 కోట్ల లాభం అందుకున్న సందర్భాలున్నాయి. చాలా మంది స్టార్లు తక్కువ సమయంలో కోట్లాది రూపాయల లాభాలు అందుకుంటున్నారు. అమితాబ్, అభిషేక్ లాంటి నటులు ఐదారేళ్లకే నాలుగైదు రెట్లు లాభం ఒకేసారి కొల్లగొడితే, చాలా మంది 60 శాతం అంతకుమించి లాభాలు అందుకున్న సందర్భాలున్నాయి.
అయితే స్వల్ప లాభమే అయినా కానీ, నటి, డ్యాన్సర్ మలైకా అరోరా తాను అమ్మిన ఫ్లాట్ నుంచి వచ్చిన డబ్బును లగ్జరీ కార్ కొనుగోలుకు వినియోగించడం ఆశ్చర్యపరిచింది. ముంబై అంథేరి వెస్ట్ లోని తన ఫ్లాట్ ని 40శాతం లాభానికి, సుమారు 5.5 కోట్లకు సేల్ చేసిన ఈ నటి 3 కోట్లతో రేంజ్ రోవర్ హై ఎండ్ కార్ ని కొనుగోలు చేసింది. దీనిని చాలా మంది విమర్శించారు. కానీ ఏదైనా ఒక చర్య వెనక, ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కొంత క్రిటిసిజం ఎదురైనా కానీ తనను సమర్థించేవాళ్లు లేకపోలేదు.
చాలా మంది ఫ్లాట్ అమ్మి, కార్ కొనడం సరైనది కాదని సూచించారు. కానీ మలైకా అరోరా ఇలా చేయడం వెనక చాలా కారణమే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మలైకా ఇటీవల రియాలిటీ షోలతో బిజీ బిజీగా ఉంది. అలాగే తనయుడిని హీరోగా పరిచయం చేయాలని కలలు కంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో తన రేంజును రేంజ్ రోవర్ రేంజుకు పెంచుకుంటోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
షారూఖ్ దిల్ సే చిత్రంలో `ఛయ్య ఛయ్యా` పాటతో పాపులరైంది మలైకా అరోరా ఖాన్. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక పాటలోను మెరిసింది. కెరీర్ లో పలు ఐటమ్ పాటలతో మెప్పించిన మలైకా మంచి డ్యాన్సర్ గా దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ముఖ్యంగా ఫ్యాషనిస్టాగా, ఫిట్ నెస్ ఫ్రీక్ గా యువతరం హృదయాలను గెలుచుకుంటోంది. ఇది సోషల్ మీడియా ద్వారా తన సంపాదనను పెంచుతోంది.