బ‌య‌ట‌పడిన మ‌లైకా నిజ రూపం.. వ‌య‌సైపోయిందా?

నటి- న‌ర్త‌కి మలైకా అరోరా వయస్సు, లుక్స్‌ గురించి సోషల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా చర్చ జరుగుతూనే ఉంటుంది.;

Update: 2026-01-16 23:30 GMT

నటి- న‌ర్త‌కి మలైకా అరోరా వయస్సు, లుక్స్‌ గురించి సోషల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో మ‌ల్లాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అయినప్పుడు నెటిజనులు కాస్త ఘాటుగానే స్పందించారు.




మలైకా అరోరా వయస్సు ప్రస్తుతం 52 ఏళ్లు. 23 అక్టోబర్ 1973 మ‌లైకా పుట్టిన‌రోజు. ఈ వయస్సులో చర్మంపై ముడతలు రావడం లేదా వయస్సు రీత్యా వచ్చే మార్పులు సహజం. సెలబ్రిటీలు కూడా మనుషులే కాబట్టి, సహజమైన వృద్ధాప్య లక్షణాలు కనిపించడం అసాధారణం ఏమీ కాదు. కానీ మ‌లైకా త‌న వ‌య‌సును ఏదో ఒక‌లా దాచేస్తోంది.




కానీ ఏదో ఒక‌రోజు బ‌య‌ట‌ప‌డే వ్య‌వ‌హార‌మే ఇది. సాధారణంగా మనం సినిమాల్లో లేదా పత్రికల్లో చూసే ఫోటోలు చాలా వరకు మేకప్, లైటింగ్ , ఎడిటింగ్ (ఫిల్టర్ల) సహాయంతో ఉంటాయి. కానీ కెమెరాలు అత్యంత స్పష్టతతో క్లోజప్ షాట్స్ తీసినప్పుడు, మేకప్ కింద ఉన్న చర్మం అసలు స్థితి కనిపిస్తుంది. దీనినే కొందరు నెటిజన్లు `నిజ రూపం` అని పిలుస్తున్నారు.

వయస్సు పెరుగుతున్నా మలైకా మ‌న‌సు సిక్స్ టీన్ లో ఆగిపోయింది. అందుకే త‌న యాక్టివిటీస్ లో టీనేజీ టింజ్ క‌నిపిస్తుంది. ఇక‌ తన ఫిట్‌నెస్ విషయంలో మలైకా రాజీకి రారు. ఎంతో కఠినంగా ఉంటారు. యోగా, జిమ్, డైట్ ద్వారా ఆమె తన శరీరాన్ని ఎంతో దృఢంగా ఉంచుకుంటారు. 50 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చూపే ఎనర్జీ - స్టైల్ చాలా మంది యువతులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను బాడీ షేమింగ్ చేయడం లేదా వయస్సు గురించి ఎగతాళి చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే మలైకా ఇలాంటి ట్రోల్స్‌ను పెద్దగా పట్టించుకోరు. `వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే` అని ఆమె గతంలో చాలాసార్లు చెప్పారు.. నిరూపిస్తూనే ఉన్నారు.

నిజానికి వృద్ధాప్యం అనేది ఎవరూ ఆపలేని ప్రక్రియ. మలైకా అరోరా తన వయస్సును ఎంతో గ్రేస్‌ఫుల్‌గా అంగీకరిస్తూనే, తన ఫిట్‌నెస్‌తో ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బాహ్య సౌందర్యం కంటే ఈ ఏజ్ లెస్ బ్యూటీ క్రమశిక్షణ, ఫిట్‌నెస్ మ్యాట‌ర్స్ లో త‌న‌కు ఉన్న అంకితభావం అభినందనీయం. మ‌లైకా నిరంత‌రం డ్యాన్స్ రియాలిటీ షోలు, ఫ్యాష‌న్ షోల నుంచి భారీగా ఆర్జిస్తోంది.



Tags:    

Similar News