మహేష్‌బాబుకు ఈడీ మరో నోటీస్ ఏం జరగబోతోంది?
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ కంపనీలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనూహ్యంగా హీరో మహేష్‌బాబు పేరు బయటికి వచ్చింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ తమ ముందు విచారణకు గత నెల 27న హాజరు కావాలని ఈడీ ఆ మధ్య నోటీసులు జారీ చేసింది. అయితే షూటింగ్ కారణంగా తాను విచారణకు ఆ రోజు హాజరు కాలేనని మహేష్ మెయిల్ ద్వారా ఈడీని రిక్వెస్ట్ చేశారు.
దీంతో మే 12న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. అయితే 12న కూడా మహేష్ ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో ఫ్రెష్‌గా ఈడీ అధికారులు హీరో మహేష్‌కు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహేష్ లండన్‌లో ఉన్నారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో `RRR` లైవ్ కాన్సర్ట్‌ని నిర్వహించారు. ఇందులో పాల్గొనడం కోసం రాజమౌళితో కలిసి మహేష్ లండన్ వెళ్లారు. ఆ కారణంగానే ఆయన 12న జరగనున్న ఈడీ విచారణకు హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే మహేష్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. రెండవ సారి కూడా మహేష్ ఈడీ విచయారణకు హాజరు కాలేకపోవడంతో ఈ సారి ఈడీ ఎలా స్పందించబోతోంది? ఎలాంటి ప్రకటన చేయబోతోందన్నది ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 16న సురానా గ్రూప్, సాయి డెవలాపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దాదాపు రూ.100 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు జరిగాయాని ఈడీ బయటపెట్టింది.
అంతే కాకుండా సురానా గ్రూప్‌కు చెందిన నరేంద్ర సురానా ప్రాంగణం నుంచి లెక్కల్లో చూపని రూ.74.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ బాబు రూ.5.7 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇదే మహేష్‌ను ఈడీ దృష్టిలో పడేలా చేసిందని, ఆయనకు నోటీసులు జారీ చేసేలా చేసిందని ఇన్ సైడ్ టాక్. మరి తాజా వివాదం నుంచి మహేష్ ఎలా బయటపడతారు? ఈడీకి ఎలాంటి సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.