హీరోగా మారుతున్న డైరెక్టర్?
లోకేష్ కనగరాజ్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్.;
లోకేష్ కనగరాజ్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.
కూలీ తో పాటూ లోకేష్ లైనప్ లో పలు ప్రాజెక్టులున్నాయి. ఖైదీ2, విక్రమ్2, రోలెక్స్, లియో2 సినిమాలు చేయాల్సిన లోకేష్ తన సినిమాలను ఒకదాన్ని మించి ఒకటి భారీ హైప్ తో రూపొందించనున్నాడు. మామూలుగా డైరెక్షన్ లో తమ సత్తా చాటి తమకంటూ ఓ ఇమేజ్ వచ్చాక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు.
కానీ వాళ్లలో కొందరు మాత్రమే యాక్టింగ్ పై ఇష్టంతో హీరోలుగా, నటులుగా మారతారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కూడా అదే చేయబోతున్నాడట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ చేయనున్నాడని, తన డెబ్యూకు తనే దర్శకత్వం వహించనున్నాడని చాలా వార్తలొస్తున్నాయి.
వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని కూడా అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమై లోకేష్ నటుడిగా మారితే లోకేష్ కెరీర్లో ఇదో కొత్త చాప్టర్ అవడం ఖాయం. డైరెక్టర్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న లోకేష్ యాక్టర్ గా కూడా నిరూపించుకుంటే ఇక తనకు తిరుగుండదు.
లోకేష్ హీరోగా డెబ్యూ ఇవ్వనున్నాడని తెలిసినప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ లో ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇండస్ట్రీలో ఆల్రెడీ మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్, తర్వాతి స్టెప్ ఏం తీసుకుంటాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి లోకేష్ హీరోగా మారతాడని వస్తున్న వార్తలపై అతనెలా స్పందిస్తాడో చూడాలి.