రీ ఎంట్రీ అంటే ఇది అనిపించేలా..!
ఆల్రెడీ హీరోయిన్ గా ఒక స్టార్ డం తెచ్చుకున్న కథానాయికలు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తే స్క్రీన్ మీద కూడా చూడడానికి బాగుంటుంది;
ఒకప్పటి హీరోయిన్స్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఆల్రెడీ హీరోయిన్ గా ఒక స్టార్ డం తెచ్చుకున్న కథానాయికలు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తే స్క్రీన్ మీద కూడా చూడడానికి బాగుంటుంది. ఐతే హీరోయిన్ గా చూసిన వాళ్లను అక్క, వదిన పాత్రల్లో చూడటం కొద్దిగా కష్టమే అనుకున్న వారు ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం ఆ హీరోయిన్స్ రీ ఎంట్రీ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఐతే రీ ఎంట్రీ అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక మంచి సినిమాతో ఇస్తే దానికి లెక్క ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఒకప్పటి హీరోయిన్స్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు. వారి సరసన లేటెస్ట్ గా లయ కూడా చేరింది. 2010 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన లయ పెళ్లి చేసుకుని ఫారిన్ లో సెటిల్ అయ్యింది. ఐతే 2018 లో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో క్యామియో రోల్ చేసింది.
ఇక ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ లయ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో లయ సిస్టర్ రోల్ చేస్తుంది. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నితిన్, లయ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయట. ఆల్రెడీ ఫ్యామిలీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న లయ రీ ఎంట్రీ లో సిస్టర్ సెంటిమెంట్ మూవీ చేయడం సూపర్ అనిపిస్తుంది. తప్పకుండా లయకి ఈ సినిమా తర్వాత వరుస ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. తమ్ముడు సినిమాలో లయ క్లిక్ అయితే మాత్రం ఈ సినిమా సెలక్షన్ ఆమె రైట్ ఛాయిస్ అవుతుందని చెప్పొచ్చు.
నితిన్ కూడా తమ్ముడు సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులను అలరించలేదు. అందుకే నితిన్ తమ్ముడితో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నితిన్ తమ్ముడు సినిమా తర్వాత బలగం వేణుతో కలిసి ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా వెరైటీ కథతో మరో హిట్ టార్గెట్ తో వస్తుందని టాక్.