టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ దూకుడు సరిపోదు!
టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు మాత్రం డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా బలం ఉన్న చిత్రాల్లో స్టార్ హీరోయిన్ నటిస్తే? తిరుగుండదు.;
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యేవి. స్టార్ హీరోయిన్లగా వెలిగిన భామలంతా సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేవారు. డివోషనల్, హారర్, థ్రిల్లర్ అంశాలను బేస్ చేసుకుని నటించిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ కాలక్రమంలో స్టార్ హీరోయిన్ల నుంచి ఆ తరహా సినిమాలు దూరమయ్యాయి.
అనుష్క తర్వాత ఆ రేంజ్ లో ఏ భామ సినిమాలు చేయలేదు. ఇప్పటికీ అనుష్కనే ఆతరహా ప్రయత్నాలు చేస్తోంది. కీర్తి సురేష్ లాంటి నటి అటెంప్ట్ చేసింది గానీ సక్సెస్ అవ్వలేదు. అప్పటి నుంచి కీర్తి కూడా ఆ తరహా చిత్రాలపై అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు మాత్రం డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సరైన కథా బలం ఉన్న చిత్రాల్లో స్టార్ హీరోయిన్ నటిస్తే? తిరుగుండదు.
ఇతర పరిశ్రమలతో పొలిస్తే టాలీవుడ్ లో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ ఎక్కువే. స్టార్ హీరోయిన్లగా చెలామాణి అయిన వారికి ఇక్కడ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఫాంలో ఉన్న హీరోయిన్లతో పాటు లేడీ ఓ రియేంటెడ్ చిత్రాలపై మక్కువున్న దర్శకులు కూడా తెరపైకి రావాలి. మంచి కథలు పడితే నటించడానికి చాలా మంది భామలు ముందుకొస్తారు. కానీ రచయితల నుంచి ఆతరహా ప్రయత్నమే కనిపించడం లేదు.
ఎంత సేపు ఇండస్ట్రీ హీరోల చుట్టూనే తిరుగుతుంది తప్ప! హీరోయిన్లతో కొత్త తరహా ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు? అని ఆలోచించే వారు కనిపించడం లేదు. సరైన కథాబలం ఉన్న చిత్రాన్ని స్టార్ హీరోయిర్ తో 10 కోట్లలో తీయోచ్చు. కంటెంట్ క్లిక్ అయిందంటే బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా వందల కోట్లు రాబ డుతుంది. టాలీవుడ్ పాన్ ఇండియాలో వెలిగిపోతున్న క్రేజ్ లో ఈ తరహా చిత్రాలు కూడా ఊపందుకుంటే? పరిశ్రమ ఖ్యాతి రెట్టింపవుతుంది.