పిక్‌టాక్ : కవర్ స్టిల్‌తో మతి పోగొడుతున్న కృతి
తాజాగా ఈమె గ్రాజియా ఇండియా 2025 వార్షికోత్సవ సంచిక కోసం కవర్ స్టిల్ ఫోటో షూట్ ఇచ్చింది. గ్రాజియా కవర్ పై ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌లో అలరించింది.;
దశాబ్ద కాలం క్రితం '1 నేనొక్కడినే' సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి సనన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు లక్ కలిసి రాలేదు. కానీ బాలీవుడ్‌లో ఈమె చేసిన మొదటి సినిమా హీరోపంతితోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో కృతి సనన్ బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో నేనొక్కడినే సినిమా తర్వాత నాగ చైతన్యకు జోడీగా దోచెయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. దాంతో టాలీవుడ్‌కి దూరం అయింది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నటిగానే కాకుండా నిర్మాతగానూ కృతి సనన్ సినీ ప్రస్థానం కొనసాగిస్తోంది. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తోంది. కొన్ని షూటింగ్ దశలో ఉంటే కొన్ని చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలతోనే కాకుండా సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు తాను రెడీ అన్నట్లుగా ఇటీవల ఒక ప్రకటనలో ఈ అమ్మడు పేర్కొంది. సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. 58.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాలో కలిగి ఉన్న ఈ అమ్మడు ఏ ఫోటో షేర్ చేసిన లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి, వెంటనే ఆ ఫోటోలు వైరల్ అవుతాయి.
తాజాగా ఈమె గ్రాజియా ఇండియా 2025 వార్షికోత్సవ సంచిక కోసం కవర్ స్టిల్ ఫోటో షూట్ ఇచ్చింది. గ్రాజియా కవర్ పై ఈ అమ్మడు బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్‌లో అలరించింది. స్టైలిష్ ఐకాన్‌గా ఎప్పటికప్పుడు కృతి సనన్ నిలుస్తూ ఉంటుంది. ఈ ఫోటోతో మరోసారి తన స్టైల్‌ను అభిమానులతో పంచుకుంది. నటిగా వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కృతి సనన్ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రమోషన్స్‌తో ఈమెకు ఎక్కువ పారితోషికం అందుతూ ఉంటుందని అంటారు.
మోడలింగ్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన కృతి సనన్ నటిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత ఫోర్బ్స్‌లోనూ చోటు సంపాదించింది. 2019 ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో కృతి సనన్ నిలిచింది. ఆదిపురుష్‌లో సీత పాత్రలో నటించడం ద్వారా అరుదైన గౌరవం దక్కించుకున్న కృతి సనన్ ఆ సినిమా ఫలితంతో నిరుత్సాహం వ్యక్తం చేసింది. అయితే ఈమె నటించిన దిల్ వాలే, హౌస్‌ఫుల్ 4, లూకా చుప్పీ, బరేలీ కి బర్ఫీ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అందమైన ఫోటోలు చూసిన సమయంలో కృతి సనన్ మళ్లీ తెలుగులో నటిస్తే బాగుండు అనే అభిప్రాయంను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమెను తిరిగి సౌత్‌కి తీసుకు వచ్చే హీరో ఎవరు అనేది చూడాలి.