మెగా కొణిదెల ప్రొడక్షన్స్ ఏమైంది..?

చిరంజీవితో సినిమా చేయాలనే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడని అనిపిస్తుంది. ఆ బ్యానర్ లో వచ్చిన నాలుగు సినిమాల్లో చిరంజీవి హీరోగా చేశారు.;

Update: 2025-12-18 05:59 GMT

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా మొదలైన ఫిల్మ్ ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 తో ఈ బ్యానర్ ని మొదలు పెట్టారు. రాం చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ బ్యానర్ తొలి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఆ తర్వాత ఇదే బ్యానర్ లో చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక 2022 లో కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా కూడా ఇదే బ్యానర్ లో వచ్చింది.

చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ..

ఈ సినిమాలో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటించారు. చిరంజీవి, చరణ్ ఉన్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోగా అది కాస్త నిరాశపరచింది. ఐతే అదే ఏడాది గాడ్ ఫాదర్ సినిమా ఇదే బ్యానర్ లో నిర్మించారు. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ వచ్చింది. ఆ సినిమా తెలుగులో డిజప్పాయింట్ చేసింది.

చిరంజీవితో సినిమా చేయాలనే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడని అనిపిస్తుంది. ఆ బ్యానర్ లో వచ్చిన నాలుగు సినిమాల్లో చిరంజీవి హీరోగా చేశారు. ఐతే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ ని వదిలి పెట్టి వి క్రియేషన్స్ అని మరో బ్యానర్ మొదలు పెట్టాడు. యువి క్రియేషన్స్ లో ఒకరైన తన స్నేహితుడు విక్రం తో వి క్రియేషన్స్ మొదలు పెట్టాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా..

మరి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో ఫ్యూచర్ లో అయినా సినిమా చేస్తారా లేదా ఆ బ్యానర్ లో కేవలం చిరు సినిమాలే చేస్తారా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. మెగా బ్యానర్ గా కొణిదెల ప్రొడక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. మరోపక్క చిరు రీ ఎంట్రీ తర్వాత ఎప్పటి నుంచో మెగా బ్యానర్ గా ముద్ర వేసుకున్న గీతా ఆర్ట్స్ లో కూడా ఒక్క సినిమా చేయలేదు. అల్లు అరవింద్ ఆ ప్రయత్నాలు చేయట్లేదా ఒకవేళ చేసినా చిరంజీవి గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా కొణిదెల ప్రొడక్షన్స్ మళ్లీ సినిమాలు మొదలు పెట్టి వరుస మెగా హీరోలతో పాటు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి సినిమాలు వచ్చేలా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నాఉ. ఐతే ఓ పక్క సినిమాల్లో నటిస్తూ నిర్మాణ సంస్థ మీద ఫోకస్ చేయడం కష్టమనే భావనతోనే చరణ్ గ్యాప్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

Tags:    

Similar News