పిక్‌టాక్ : ఇదేం డ్రెస్ మేడం భలే ఉందే..!
తెలుగు ప్రేక్షకులకు 'తడాఖా' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా జెరిమియా.;
తెలుగు ప్రేక్షకులకు 'తడాఖా' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా జెరిమియా. ఈమె మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్లే బ్యాక్ సింగర్‌గా చేసింది. తన గొంతుతో ఎంతో మంది హీరోయిన్స్ పాత్రలకు ప్రాణం పోసింది. పాట, మాట ఏదైనా ఆండ్రియా అదరగొట్టింది. నటిగా 2007లో పచ్చైకిలి ముత్తుచారం అనే తమిళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగానూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మొదటి సినిమాతోనే ఇంతటి ప్రతిభ కనబర్చిన ఆండ్రియాకు దక్కిన ప్రశంసల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆండ్రియా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందని అప్పుడే అనుకున్నారు. అన్నట్లుగానే తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ ఆండ్రియా వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది.
వరుస తమిళ్ సినిమాలతో ఆండ్రియా జెరిమియా
తడాఖా సినిమా తర్వాత తెలుగులో వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన ఆండ్రియా వరుసగా తమిళ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు హిందీ, మలయాళ సినిమాలను సైతం చేసింది. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో సైంధవ్ సినిమాను చేసిన విషయం తెల్సిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో ఆండ్రియా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. దాంతో ఆమె మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికే చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె నాలుగు తమిళ సినిమాలు చేస్తోంది. అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో కనీసం మూడు సినిమాలతో అయినా ఆండ్రియా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఈమె ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయింది.
సోషల్ మీడియాలో ఆండ్రియా అందాల షో
సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా షేర్ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే ఆండ్రియా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా థైస్ అందాలను చూపిస్తూ విభిన్నమైన ఔట్ ఫిట్ లో ఆండ్రియా చూపు తిప్పనివ్వడం లేదు. చాలా మంది నెటిజన్స్ ఇదేం డ్రెస్ మేడం భలే ఉంది అంటూ ఆమె షో ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి విభిన్నమైన ఔట్ ఫిట్ లను ధరిస్తేనే కదా జనాలు చూసేది అంటూ కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఆండ్రియా ఈ అందాల షో ను కొందరు ఎప్పటిలాగే ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
చిన్నప్పటి నుంచే ఆండ్రియా స్టేజ్ షో లు
ఆండ్రియా తమిళనాడులోని అరక్కోణంలోని ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి మద్రాస్ హైకోర్ట్‌లో న్యాయవాది. చెన్నైలోని పెరంబూరులోని సెయింట్ జోసెఫ్స్ ఆంగ్లో ఇండియన్ కాలేజీ నుంచి డిగ్రీని తీసుకుంది. ఆండ్రియా ఎనిమిది ఏళ్ల వయసులోనే క్లాసికల్ పియానో నేర్చుకుంది. 10 ఏళ్ల వయసులో యంగ్ స్టార్స్ అనే జాక్సన్ ఫైవ్ స్టైల్ టీంలో భాగం అయ్యి స్టేజ్ షో లు ఇచ్చింది. థియేటర్ ఆర్టిస్టుగానూ ఆండ్రియా చేసింది. నాటకాలు వేయడం ద్వారా నటనలో ప్రావిణ్యం సొంతం చేసుకుంది. స్టేజ్ షో లు చేయడంతో పాటు, పలు కార్యక్రమాల్లో ఆండ్రియా పాడటం వల్ల మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగానే కాకుండా ఇప్పటికీ ఈమెను సింగర్‌గా చాలా మంది చూస్తూ ఉంటారు. ఆమె పాటలను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.