• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోల‌ను 'గే'ల‌తో పోల్చిన...

హీరోల‌ను 'గే'ల‌తో పోల్చిన సుచీపై హీరో వైఫ్‌ ఫైరింగ్!

| వీరంతా హిజ్రాలు అంటూ సుచీ వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

By - Tupaki Desk
Update: 2024-05-22 03:00 GMT

సుచీ అలియాస్ సుచిత్ర మ‌రోసారి యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌లో చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే. నాటి సుచీలీక్స్ వ్య‌వ‌హారాన్ని ఇప్ప‌టికీ మ‌ర్చిపోని ప్ర‌జ‌ల‌కు ఇది సెకండ్ సీజ‌న్ ట్రీట్‌లా మారింది. అయితే ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల‌పై సుచిత్ర చేసిన‌ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. గాయని కం రేడియో జాకీ సుచిత్ర ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో దళపతి విజయ్, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్, శింబు, ధనుష్, షారుఖ్ ఖాన్, క‌ర‌ణ్ జోహార్ వంటి సినీ సెల‌బ్రిటీలపై తీవ్ర‌మైన‌ ఆరోపణలు చేసింది. ఆ తర్వాతా ఈ జాబితాలో కొత్త పేర్లు చెబుతూనే ఉంది. వీరంతా హిజ్రాలు అంటూ సుచీ వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

తన మాజీ భర్త కార్తీక్‌ కుమార్‌ను 'గే' అని అత‌డు ప్ర‌ముఖ హీరోతో క‌లిసి నైట్ పార్టీల‌కు వెళ‌తాడ‌ని కూడా ఆమె ఆరోపించింది. ఇప్పుడు కార్తీక్ నేరుగా త‌న మాజీ భార్య‌ సుచిత్రకు లీగల్ నోటీసు పంపాడు. అయితే సుచిత్ర దీనిపై ఇంకా స్పందించలేదు. గాయ‌ని సుచిత్ర చేసిన తీవ్ర‌ ఆరోపణలపై నటుడు కమ్ రాజకీయవేత్త ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయనిధి స్పందించడం గమనించదగ్గ విషయం.

తాజా వివాదంలో కిరుతిగ ఉదయనిధి పరోక్షంగా సుచిత్రపై విరుచుకుపడ్డారు. ఆమె ఆగ్రహంతో విరుచుకుపడింది. X (ట్విట్ట‌ర్) ఖాతాలో కిరుతిగ ఒక నోట్ రాసారు. కొన్ని ఇంటర్వ్యూలను మరో 50 మంది సమీక్షించడం వల్ల ప్రయోజనం ఏమిటో ఎవరైనా నాకు చెప్పగలరా? సోషల్ మీడియాలో వ్యక్తుల దుర్బలత్వాన్ని ఉపయోగించుకోవడం నాసిరకం..! అని సీరియ‌స్ అయ్యారు. సుచిత్ర వివాదాస్పద ఇంటర్వ్యూలను కిరుతిగ స్టాలిన్ పరోక్షంగా ప్రశ్నించారు. సుచిత్ర చాలా యూట్యూబ్ ఛానెల్‌లలో కనిపిస్తోంది. పరిశ్రమలోని ప్రముఖ సినీ తారలపై బహిరంగంగా ఆరోపణలు చేసింది. చివ‌ర‌కు బాలీవుడ్ నటీనటులను కూడా ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తోంది.

సుచిత్రపై కిరుతిగ ఉదయనిధి చేసిన విమర్శలపై ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. ప‌లువురు నెటిజ‌నులు కిరుతిగా పోస్ట్‌కు మద్దతు ఇచ్చారు. ఒక X ఖాతాదారు ఇలా రాసారు. ప్రతిఒక్కరూ ఎంత నిరుద్యోగులుగా ఉన్నారో ఈ దృశ్యం చూపిస్తుంది! అని వ్యాఖ్యానించాడు. రెండవ వ్య‌క్తి వ్యాఖ్యానిస్తూ ``ఈ రోజుల్లో ఇంటర్వ్యూలు అర్ధంలేనివి.. వారు చట్టవిరుద్ధంగా చెల్లించిన డ‌బ్బు కోసం ప్రజలను తప్పుగా అభివ‌ర్ణిస్తూ తారుమారు చేస్తున్నారు.. అని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేని వ్యక్తులకు మరేదైనా మంచి వినోదం ఉందా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగదారులకు? ఆన్‌లైన్ గేమ్‌లు ఇప్పుడు బోరింగ్‌గా ఉన్నాయి అని ఒక‌రు వ్యాఖ్యానించారు. ఆ సమీక్షకులందరూ ఇతరుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్‌ల కోసం మాత్రమే పని చేస్తారు.. వారు సామాజిక సమస్యల గురించి ఎప్పుడూ పట్టించుకోరు.. అని కూడా ఒక‌రు వ్యాఖ్యానించారు.

త‌న మాజీ భ‌ర్త కార్తీక్ .. అత‌డి స్నేహితుడైన‌ ప్ర‌ముఖ త‌మిళ‌ హీరో స్వలింగ సంపర్కులు అంటూ సుచిత్ర కామెంట్ చేయ‌గా.. కార్తీక్ ఆమెకు లీగల్ నోటీసు పంపారు. అంతేకాదు ఇంటర్వ్యూలో సుచిత్ర తన వ్యక్తిగత విషయాలను చర్చించడం మానుకున్నట్లు కూడా కార్తీక్ పేర్కొన్నాడు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటే పరువు నష్టం కేసు పెడతానని సుచిత్రను కార్తీక్ హెచ్చ‌రించాడు.

Can someone tell me what is the purpose of some interviews and 50 other people reviewing it? Taking advantage of ppl's vulnerabilities on social media is in poor taste...

— kiruthiga udhayanidh (@astrokiru) May 19, 2024
Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Bollywood 
  • FilmIndustry 
  • Suchitra 
  • RadioJocker 
  • Singer 
  • VijayThalapathy 
  • KamlaHaasan 
  • Dhanush 
  • ShahRukhKhan 
  • KaranJohar 
  • KartikKumar 
  • UdhayanidhiStalin 
  • Kiruthiga 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS