• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఏంటి బాబాయ్ సంగతులు'...

'ఏంటి బాబాయ్ సంగతులు' అంటున్న కిరణ్ అబ్బవరం!!

| కొద్ది రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లి సందడి చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-13 13:50 GMT

కోవిడ్ తర్వాత ప్రజల లైఫ్ స్టైల్, ఫుడ్ ఈటింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది.. హెల్దీ, హైజీన్ ఆహారాన్ని మాత్రమే తినేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే బాబాయ్ హోటల్.. ఫుడ్ లవర్స్ కు రుచి అండ్ శుచి సమపాళ్లలో ఉన్న ఆహారం అందిస్తోందని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లి సందడి చేస్తున్నారు.


తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. బాబాయ్ హోటల్ కొత్త బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ఆ హోటల్ యజమానులు కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్టారెడ్డిలతో కలిసి హైదరాబాద్ లోని మాదాపూర్ లో బ్రాంచ్ ను ప్రారంభించారు కిరణ్. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ తోపాటు ప్రజలతో సరదాగా ముచ్చటించారు. "చాలా మంది యువకుల్లాగే నేను కూడా ఆహార ప్రియుడిని. విభిన్న వంటకాలను ట్రై చేసేందుకు ఇష్టపడతాను. బాబాయ్ హోటల్ నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి" అని తెలిపారు.


"ప్రతి వ్యక్తికి ఆహారం పట్ల సహజంగానే చాలా ఇష్టం, ప్రేమ ఉంటుంది. రుచికరమైన పదార్ధాలు, మంచి ఆహారాన్ని తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇష్టమైన, నచ్చిన ఆహారం తిన్నప్పుడు మనసు సంతృప్తి చెందడం కామన్. నాకు బాబాయ్ హోటల్ ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టం. వాటిని తింటుంటే నా కడుపుతో పాటు మనసు కూడా నిండినట్టుగా అనిపిస్తుంది" అని చెప్పారు.


"గత 8 దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. దోశ, ఇడ్లీ, వడ, ఉప్మా మొదలైన వాటికి ఫేవరెట్ స్పాట్ గా మారింది. కొబ్బరి చట్నీ, సాంబార్‌ తో టిఫిన్స్ అందిస్తాం. మా వంటల్లో ప్రతి దానికి స్పెషల్ టేస్ట్ ఉంటుంది. దక్షిణ భారత వంటకాలు, రుచులను కొత్తగా ఫుడ్ లవర్స్ కు అందించడమే మా లక్ష్యం" అని హోటల్ యజమానులు తెలిపారు.


ఇక కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లోనే రాజా వారు రాణివారు అంటూ మంచి ప్రేమ కథతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చివరగా రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారాయన. ఇక సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ముందుకు కొనసాగుతున్న కిరణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఇటీవల తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరఖ్ ను లవ్ చేసి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమెతో ఏడడుగులు వేయబోతున్నాడు.

Tags:    
  • RajavaaruRaanigaaru 
  • KiranAbbavaram 
  • DilRooba 
  • BabiHotel 
  • KvDineshReddy 
  • SresthaReddy 
  • Madhapur 
  • Hyderabad 
  • FavoriteFood 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS