కాస్టింగ్‌తోనే కిక్కు పెంచుతున్న కింగ్!
చాలామంది అగ్ర దర్శకులు పాన్ ఇండియన్ సినిమాల్ని ప్లాన్ చేస్తూ, అన్ని భాషల హీరోలకు అవకాశాలు కల్పిస్తున్నారు.;
ఇటీవలి కాలంలో భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అనదగ్గ భారీ మల్టీస్టారర్లకు తెర లేచింది. చాలామంది అగ్ర దర్శకులు పాన్ ఇండియన్ సినిమాల్ని ప్లాన్ చేస్తూ, అన్ని భాషల హీరోలకు అవకాశాలు కల్పిస్తున్నారు. నిజానికి ఇది చాలా మంది ఖాళీగా ఉన్న స్టార్లకు కూడా అవకాశాలు పెంచిందని చెప్పాలి.
తాజా సమాచారం మేరకు.. షారూఖ్ ఖాన్ `కింగ్` చిత్రంలో కాస్టింగ్ అంతకంతకు విశ్వరూపం దాల్చుతోంది. ఈ చిత్రంలో అనీల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి క్రేజీ వెటరన్ స్టార్లు నటిస్తున్నారు. మే 20న చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఇప్పుడు సీనియర్ స్టార్ల ప్రవేశం గురించి టాక్ వినిపిస్తోంది. జాకీ ష్రాఫ్ పాత్ర వివరాలు ఇంకా గోప్యంగా ఉంచగా, అనిల్ కపూర్ ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కి గురువుగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది.
ఖాన్ ఇందులో శిక్షణ పొందిన హంతకుడు పాత్రను పోషిస్తున్నాడు. అనిల్ పాత్ర గూఢచర్యం, యాక్షన్ పార్ట్ లో కింగ్ ని నడిపించేదిగా కనిపిస్తుందట. సీనియర్ నటుడి అనుభవం ఈ పాత్రకు ప్రధాన బలంగా మారుతుందని దర్శకుడు భావిస్తున్నారు. కింగ్ చిత్రంలో షారూఖ్ పూర్తిగా కొత్తదనం నిండిన వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాడు. ఇందులో స్టంట్స్ మరో లెవల్లో ఉంటాయని తెలుస్తోంది. దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్, అర్షద్ వార్సీ ,అభయ్ వర్మ తదితరులు నటిస్తున్నారు.
స్టంట్స్ కోసం మేకర్స్ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్లను కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. మే 18- మే 20 మధ్య ముంబైలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. భారతదేశ షెడ్యూల్ తర్వాత, యూనిట్ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ షెడ్యూల్ లో పాల్గొంటుంది. అక్టోబర్ - డిసెంబర్ 2026 నాటికి విడుదల చేయాలనేది ప్లాన్. సచిన్-జిగర్ పాటలను స్వరపరుస్తుండగా, అనిరుధ్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. రాజ్ అండ్ డీకే ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన జైదీప్ అహ్లావత్ మరో విలన్‌గా నటించడానికి ఎంపికయ్యారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ స్వయంగా అహ్లావత్‌ని సంప్రదించి, వ్యక్తిగతంగా ఫోన్ చేసి అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో అతడు శక్తివంతమైన విలన్‌గా కనిపిస్తాడు. త్వరలో షూటింగ్ లోను పాల్గొంటాడని తెలిసింది.