'కిల్లర్' గ్లింప్స్: వైమానిక శాస్త్రం నుంచి AI వరకు.. కొత్తగా ఉందే..

గ్లింప్స్‌ చూస్తే కథలో ఒక మిస్టరీ ఉన్నట్టే కాదు, దాని పరిణామం ప్రస్తుత సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా చూపించబోతున్నారు.;

Update: 2025-05-01 14:04 GMT

తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి కంటెంట్ తో అయినా ఎక్కడివరకైనా వెళ్లగలదని నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఇక ఇప్పుడు మరోసారి 'కిల్లర్' సినిమాతో అదే చర్చ హైలెట్ అవుతోంది. మితిమీరిన యాక్షన్ కాదూ, కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌కే ఆధారపడిన సినిమా కూడా కాదు.. కథ, ఏమోషన్, కాన్సెప్ట్ అన్నింటినీ కలిపి కొత్త లెవెల్‌లో చూపించబోతున్న సినిమా అని అర్ధమవుతుంది.

దర్శకుడు పూర్వజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో సస్పెన్స్, విజన్ రెండింటికీ పునర్నిర్వచనంగా నిలుస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఒక సాధారణ టీజర్‌గా కాకుండా, ఆలోచించుకునేలా చేసే థీమ్‌తో ప్రారంభమవుతుంది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన 'వైమానిక శాస్త్రం'.. అంటే వైమానిక విజ్ఞానం గురించి ఒక విభిన్నమైన కోణాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది.

'మన పూర్వీకులు చెప్పిన ఆత్మ కలిగిన యంత్రాలు.. ఇప్పుడు నిజం కానున్నాయా?' అనే ప్రశ్నను థీమ్‌గానే తీసుకుని చిత్రంలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. 'కిల్లర్' కథాంశంలో ప్రాచీన గాథలు, ఆధునిక విజ్ఞానం, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్లు అద్భుతంగా మిక్స్ చేసినట్లు అర్ధమవుతుంది. ప్రేమ, ప్రతీకారం, మానవతా విలువలు, అలాగే ఏఐ మిషన్‌ల మధ్య పరస్పర సంబంధాన్ని చూపించడానికి ఈ సినిమా ప్రయత్నిస్తోంది.

గ్లింప్స్‌ చూస్తే కథలో ఒక మిస్టరీ ఉన్నట్టే కాదు, దాని పరిణామం ప్రస్తుత సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా చూపించబోతున్నారు. విజువల్స్ విషయంలో Merge XR వారు అందించిన వర్చువల్ ప్రొడక్షన్ పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇది కేవలం టెక్నికల్ అద్భుతం మాత్రమే కాకుండా, కథను బలంగా అందించడానికి కీలకంగా మారుతోంది. VFX వర్క్‌కి థియేటర్లో మంచి స్పందన రావడం ఖాయం. గ్లింప్స్ చూసిన వారు సినిమా ఎలా ఉంటుందో ఊహించగలిగేంత ఉత్కంఠను తెచ్చింది.

ఈ సినిమాతో పూర్వజ్‌ కేవలం దర్శకుడిగానే కాకుండా హీరోగానూ దర్శనమివ్వబోతున్నారు. ఆయనకు జ్యోతి పూర్వజ్ జోడిగా కనిపించనున్నారు. విశాల్ రాజ్, గౌతమ్ లాంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థింక్ సినెమా బ్యానర్‌పై AU&I, Merge XR సంస్థల సహకారంతో పూర్వజ్, ప్రజయ్ కామత్, పద్మనాభ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే సినిమా థియేటర్లలోకి రానుంది.

Full View
Tags:    

Similar News