పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యధిక రన్ టైం ఉన్న చిత్రాలివే.. మరి ఫలితం సంగతి?

జాబితాలో మరో భారీ సినిమా 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివితో విడుదలైంది.;

Update: 2026-02-18 15:30 GMT

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ దగ్గర పూనకాలు మొదలవుతాయి. అయితే పవర్ స్టార్ సినిమాల్లో లెంగ్త్ (రన్ టైమ్) కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే. సాధారణంగా మూడు గంటల నిడివి ఉన్నా బోర్ కొట్టకుండా చూడగల స్టామినా పవన్‌కు ఉంది. 'అత్తారింటికి దారేది' నుంచి ఇప్పుడు రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' వరకు అత్యధిక నిడివి ఉన్న సినిమాలేవి? వాటిలో ఎన్ని హిట్లు, ఏది ఫ్లాప్? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

బ్లాక్ బస్టర్ల నుంచి భారీ రన్ టైమ్ వరకు:

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక రన్ టైమ్ ఉన్న సినిమాల జాబితాలో 'అత్తారింటికి దారేది' అగ్రస్థానంలో ఉంటుంది. సుమారు 2 గంటల 49 నిమిషాల నిడివి ఉన్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మేజిక్, సమంత-ప్రణీతలతో పవన్ కెమిస్ట్రీ ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేసింది. ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' 2 గంటల 44 నిమిషాల నిడివితో వచ్చింది. బాబీ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశి ఖన్నాలతో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా దాదాపు 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్‌తో రాబోతోంది. గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ వస్తుండటంతో ఈసారి లెంగ్త్ ఎక్కువున్నా అభిమానులు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు.

నిడివి ఎక్కువ ఉన్నా.. పవన్ మేనియా తగ్గేదే లే:

జాబితాలో మరో భారీ సినిమా 'అజ్ఞాతవాసి'. త్రివిక్రమ్ దర్శకత్వంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా 2 గంటల 38 నిమిషాల నిడివితో విడుదలైంది. అయితే పవన్ సినిమాల్లో నిడివి ఎక్కువ ఉండి నిరాశపరిచిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇవే కాకుండా పవన్ పాత సినిమాల్లో ఖుషి S.J. సూర్య - భూమిక హీరోయిన్. ఇక 'జానీ' పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించిన మూవీ - రేణు దేశాయ్ హీరోయిన్.. ఇది కూడా 2 గంటల 30 నిమిషాల కంటే ఎక్కువ రన్ టైమ్ కలిగి ఉన్నవే. ఇక ఖుషి క్లాసిక్ హిట్‌గా నిలిస్తే, 'జానీ' ప్రయోగాత్మకంగా మిగిలిపోయింది. అలాగే గత ఏడాది 'హరి హర వీర మల్లు' కూడా సుమారు 2 గంటల 41 నిమిషాల నిడివితో వచ్చినా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

రన్ టైమ్ ఎంతైనా.. పవర్ స్టార్ కనిపిస్తే చాలు:

ఇక సినిమా నిడివి ఎంత అన్నది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎప్పుడూ పెద్ద సమస్య కాదు. స్క్రీన్ మీద పవన్ నడక, ఆయన డైలాగ్ డెలివరీ ఉంటే చాలు, థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. అజ్ఞాతవాసి లాంటి చిన్న తడబాట్లు ఉన్నా, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు కూడా అదే లెంగ్త్‌తో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు కూడా రన్ టైమ్ విషయంలో రికార్డులు సృష్టిస్తూనే బాక్సాఫీస్ వద్ద కూడా సునామీ సృష్టిస్తాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News