వీడియో : 'ఖలేజా' సీన్ రీ క్రియేట్... ఇదెక్కడి మాస్ మామ
మహేష్ బాబు అభిమానులు గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న 'ఖలేజా' సినిమా రీ రిలీజ్ అయింది.;
మహేష్ బాబు అభిమానులు గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న 'ఖలేజా' సినిమా రీ రిలీజ్ అయింది. 2010లో విడుదలైన ఖలేజా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా అత్యంత దారుణమైన పరాజయంను చవిచూసిన విషయం తెల్సిందే. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కోట్లల్లో నష్టపోయారు. థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్‌గా నిలిచినా కూడా టీవీల్లో మాత్రం ఖలేజా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఖలేజా సినిమా టీవీలో ప్రసారం అయిన ప్రతి సారి టీవీలకు అతుక్కు పోవడం జరిగింది. వందల సార్లు వచ్చిన ఖలేజా సినిమాను రీ రిలీజ్ చేశారు.
ఖలేజా సినిమా ఏ థియేటర్‌లలో రీ రిలీజ్ అయ్యిందో ఆ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన మురారి సినిమా రీ రిలీజ్ సమయంలో అలనాటి రామచంద్రుడు పాటను రీ క్రియేట్ చేయడం, థియేటర్‌లో పెళ్లిలు చేసుకోవడం, డాన్స్‌లు చేయడం మనం చూశాం. ఇప్పుడు ఖలేజా సినిమా రీ రిలీజ్ సమయంలోనూ అదే సందడి కనిపిస్తుంది. థియేటర్‌ల వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఖలేజా సినిమాలోని ఐకానిక్ సన్నివేశాలు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు. హాస్పిటల్ సీన్ వచ్చిన సమయంలో ఫ్యాన్స్ కేకలతో రెచ్చి పోయారు.
ఒక థియేటర్‌లో హాస్పిటల్ సీన్‌ను రీ క్రియేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ బాబు మాదిరిగానే అచ్చు అభిమాని హాస్పిటల్ డ్రెస్‌ను ధరించి కనిపించాడు. డైలాగ్ టు డైలాగ్‌ను చెబుతూ చెట్టును కింద పడేసి తొక్కుతూ చేసిన యాక్టింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఖలేజా సినిమాలోని ప్రతి సీన్ ను అభిమానులు రీ క్రియేట్ చేశారు. సినిమాలోని అన్ని డైలాగ్స్, కామెడీ సీన్స్‌ను ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో మనం ఈ వీడియోలో చూడవచ్చు. మొత్తానికి ఖలేజా సినిమాను అభిమానులు ముందు నుంచి ఎంజాయ్ చేస్తారని అనుకున్నట్లుగానే ఎంజాయ్ చేశారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోపు మహేష్ బాబు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు రాజమౌళి సినిమా వచ్చేప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. జూన్ లేదా జులై నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 2027లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.