పిక్‌టాక్ : కీర్తి సురేష్‌ దుబాయ్‌ ట్రిప్‌ ఇలా..!

వరుస షూటింగ్స్ కారణంగా కీర్తి సురేష్ పర్సనల్‌ లైఫ్ ను కోల్పోతున్నట్లుగా ఫీల్‌ అవుతుందట. అందుకే ఈ ఏడాది చివర్లో మరో బ్రేక్‌ తీసుకుంది.;

Update: 2025-10-31 10:34 GMT

గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ ఈ ఏడాది మాత్రం ఒకే ఒక్క సినిమాలో కనిపించింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. తెలుగులో చాలా రోజుల తర్వాత కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన కీర్తి సురేష్ తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తుంది. ఈ ఏడాది పెద్దగా సినిమాలతో రాకున్నా కూడా బిజీ బిజీగా ఉంటూ వచ్చింది. పెళ్లి అయిన తర్వాత వెంటనే షూటింగ్స్‌కు హాజరు కావాల్సి వచ్చింది. భర్తతో కలిసి ట్రిప్‌కు వెళ్లినా తక్కువ రోజుల్లోనే కీర్తి సురేష్ రావాల్సి వచ్చింది. వరుస షూటింగ్స్ కారణంగా కీర్తి సురేష్ పర్సనల్‌ లైఫ్ ను కోల్పోతున్నట్లుగా ఫీల్‌ అవుతుందట. అందుకే ఈ ఏడాది చివర్లో మరో బ్రేక్‌ తీసుకుంది. ఇటీవలే ఈ అమ్మడు దుబాయ్ వెళ్ళింది. దుబాయ్ వెళ్లిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా తన అభిమానులకు ఫాలోవర్స్‌కు కీర్తి సురేష్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అయింది.



 


కీర్తి సురేష్‌ దుబాయ్ ట్రిప్‌

దుబాయ్‌ ట్రిప్‌ సందర్భంగా తీసుకున్న సెల్ఫీతో పాటు, తిన్న ఫుడ్‌ ఫోటోలను కూడా కీర్తీ సురేష్ షేర్‌ చేసింది. ఉదయాన్నే ప్రయాణం కావడంతో ఇలా గజిబిజీగా ఉన్నాను అంటూ ఒక ఫోటోను షేర్‌ చేసింది. మేకప్‌ లేకున్నా ఆ ఫోటోలో లూజ్ హెయిర్‌తో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. చూపు తిప్పుకోనివ్వని ఆమె అందం తో మరోసారి మెప్పించింది. ఇంత అందంగా ఉన్నారు గజిబిజిగా ఉన్నాను అని అంటారు ఏంటి అంటూ చాలా మంది కామెంట్‌ చేశారు. ఆ తర్వాత తాను తిన్న ఫుడ్‌ కు సంబంధించిన ఫోటోను షేర్‌ చేయడం ద్వారా సర్‌ప్రైజ్‌ చేసింది. సాధారణంగా హీరోయిన్స్‌ తెగ డైట్‌ ఫాలో అవుతారు. ముఖ్యంగా డీప్‌ ఫ్రై ఫుడ్‌ కి చాలా దూరం ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం పూరి తినడం ద్వారా అందరికీ షాక్ ఇచ్చింది. తాను ట్రిప్‌లో ఉన్న సమయంలో కేవలం ఇలాంటి ఫ్రై ఫుడ్‌ మాత్రమే తింటాను అన్నట్లుగా ఫోటోపై క్యాప్షన్ ఇచ్చి మరీ చెప్పింది.



 


విజయ్‌ దేవరకొండ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా...

కీర్తి సురేష్ ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది. దిల్‌ రాజు బ్యానర్‌లో రూపొందబోతున్న ఆ సినిమా కోసం కీర్తి సురేష్ వచ్చే ఏడాది ఆరంభం నుంచి కెమెరా ముందుకు వస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది మొదలుకుని పూర్తి అయ్యే వరకు బ్రేక్ తీసుకునే వీలు ఉండదు కనుక కీర్తి సురేష్ ఈ బ్రేక్‌ లోనే దుబాయ్‌ ట్రిప్‌ వెళ్లినట్లు గా ఆమె సన్నిహితులు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ఆమె తన భర్తకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయలేదు. అయినా కూడా ఆయన ఈ దుబాయ్ ట్రిప్‌ లో కీర్తి సురేష్ వెంట ఉండి ఉంటాడు అని చాలా మంది నమ్ముతున్నారు.

బాలీవుడ్‌లో బేబీ జాన్‌ సినిమాతో కీర్తి సురేష్‌

ఫిల్టర్‌ లేకుండా, ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను షేర్‌ చేయడం కేవలం కీర్తి సురేష్ కి మాత్రమే చెల్లుతుంది అంటూ ఆమె అభిమానులు ఈ ఫోటోలకు తెగ కామెంట్‌ చేస్తున్నారు. మహానటి వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌లోనూ గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ అక్కడ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను చేసింది. బాలీవుడ్‌లో ఈమె ఎంట్రీ ఇచ్చిన బాబీ జాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా హిందీ ఫిల్మ్‌ మేకర్స్ నుంచి ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని, ప్రస్తుతానికి సౌత్‌ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు ఆమెకు సంబంధించిన వారు అంటున్నారు. బాలీవుడ్‌లో ముందు ముందు రోజుల్లో కీర్తి సురేష్ సినిమాలు చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈమె మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News