ఇండియన్ కల్చర్ ను అవమానించేలా కొరియన్ డ్రామా
టు ది మూన్ షో లో కామెడీ కోసం బొట్టు లాంటి సాంస్కృతిక అంశాలను వాడటం కాంట్రవర్సీగా మారింది.;
ఇండియాలో కొరియన్ సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు మంచి ఆదరణే ఉంది. యూత్ ఆడియన్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఎక్కువగా కొరియన్ డ్రామాలు, వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చూసి వారిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభిమానులు కొరియన్ కల్చర్ ను, వారి క్రియేటివిటీని ఆరాధిస్తుంటారు. కానీ రీసెంట్ గా ఓ కొరియన్ డ్రామాలోని కొన్ని సీన్స్ ఇండియన్ ఆడియన్స్ ను నిరాశకు గురిచేశాయి.
తామెంతో ఆరాధించే కొరియన్ మూవీస్ లో ఇండియన్ సంస్కృతిని అరబ్ సంస్కృతితో కలిపి తప్పుగా చూపించడంతో పాటూ కొన్ని పవిత్రమైన గుర్తులను జోకులుగా మార్చడం ఇండియన్ ఆడియన్స్ కు బాధను కలిగిస్తూ, వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. పొరుగున ఉన్న ఆసియా సంస్కృతి పట్ల కనీస అవగాహన, గౌరవం లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
కొరియన్ డ్రామాపై ఇండియన్స్ ఫైర్
టు ది మూన్ షో లో కామెడీ కోసం బొట్టు లాంటి సాంస్కృతిక అంశాలను వాడటం కాంట్రవర్సీగా మారింది. మొదట్లో ఇది ప్రోగ్రెస్సివ్ గా కనిపించినప్పటికీ తర్వాత ఇండియాను వేరే దేశంగా స్టీరియోటైప్ లో చూపించడం వల్లే ఇదంతా జరగిందని, ఈ విషయంలో టు ది మూన్ యూనిట్ ఇండియన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొంది.
అరబిక్ తలపాగాలు, భారతీయ దుస్తుల మధ్య గందరగోళం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఇండియా గురించి సరిగ్గా చూపించడం రాకపోతే దాన్ని వదిలేయాలని అంతేకానీ ఇలా చూపించి దేశం విలువను తగ్గించకుండా ఉండాలని ఆడియన్స్ సోషల్ మీడియాలో సదరు మూవీ దర్శకనిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరియన్ డ్రామా ద్వారా ఇండియాలో ఎంతో పాపులరైన లీ సన్ బిన్, రా మి రాన్, కిమ్ యంగ్ డే లాంటి వాళ్లు ఇలాంటివి చేయడంపై కూడా ఇండియన్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.