• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారంలో రెండు రిలీజ్ లు.....

వారంలో రెండు రిలీజ్ లు.. అమ్మడు వెరీ లక్కీ..!

| ఫిబ్రవరి 9న ఈగల్ రిలీజ్ అవుతుండగా ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవ కోన వస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-02-07 09:05 GMT

హీరోలకన్నా హీరోయిన్స్ కి వారి కెరీర్ ఎక్కువగా లక్ మీద ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ వారి ఎఫర్ట్ లేనిదే ఆఫర్లు వచ్చే ఛాన్స్ లేదు కానీ ఎంతోకొంత లక్ ఫేవర్ చేయాల్సిందే. కొందరు హీరోయిన్స్ కి ఒకేసారి వరుస ఆఫర్లు వస్తుంటాయి.. కొందరికి ఎంత టాలెంట్ ఉన్నా ఛాన్స్ లు రావు. ఈ లాజిక్ ఇప్పటివరకు ఎవరికి అర్థం కాదు. హీరోయిన్స్ విషయంలో ఎప్పుడు వెలితిగా ఉండే టాలీవుడ్ లో కొద్దిగా టాలెంట్ చూపించే హీరోయిన్స్ కి అవకాశాల మీద అవకాశాలు ఇస్తుంటారు.

లేటెస్ట్ గా నార్త్ భామ కావ్య థాపర్ కి తెలుగులో అవకాశాలు ఎక్కువ అయ్యాయి. మొదటి సినిమా ఈమాయ పేరేమిటో తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన అమ్మడు ఏక్ మిని కథతో హిట్ అందుకుంది. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ అయినా కూడా అక్కడ హిట్ తో ఫాం లోకి వచ్చింది. ఇక తెలుగులో అమ్మడు రెండు మంచి అవకాశాలు అందుకుంది. మాస్ మహరాజ్ రవితేజ తో ఈగల్ సినిమా చేసిన ఈ అమ్మడు సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవ కోన సినిమా చేసింది. ఈ రెండు సినిమాల్లో ఆమెది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.

అయితే రెండు వేరే వేరు డేట్స్ లో మొదలైనా కూడా రిలీజ్ లు మాత్రం వారం గ్యాప్ తో అవుతున్నాయి. ఫిబ్రవరి 9న ఈగల్ రిలీజ్ అవుతుండగా ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవ కోన వస్తుంది. ఈ రెండు సినిమాల్లో కావ్య థాపర్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇలా ఒక హీరోయిన్ సినిమాలు రెండు వారం గ్యాప్ లో రిలీజ్ అవ్వడం లక్కీ అని చెప్పొచ్చు. తప్పకుండా ఈ రెండు సినిమాల వల్ల దర్శక నిర్మాతల దృష్టిలో కావ్య పడే అవకాశం ఉంటుంది.

ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకుంటే అమ్మడికి మరిన్ని ఆఫర్లు వచ్చేస్తాయి. అలా కావ్య థాపర్ కెరీర్ లో రవితేజ, సందీప్ కిషన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం ఆమెకు లక్కీ అని చెప్పొచ్చు. రెండు సినిమాలు హిట్ పడితే మాత్రం కావ్య ఇక టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఊహించని విధంగా కావ్య ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. రవితేజ ఈగల్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన ఈ రెండిటితో అమ్మడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024


Tags:    
  • Kavyathapar 
  • Eaglemovie 
  • Oruperubhairavakona 
  • Raviteja 
  • Sundeepkishan 
  • Tollywood 
  • Actress 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS