ఈగల్ 2, మిరాయ్ 2 - కార్తీక్ ఘట్టమనేనికి ఏది బెటర్ !

అందుకే ఈగల్ 2ను పక్కనపెట్టేసి మాస్ మహారాజ కటౌట్ తగిన ఇంకో కథను రాసుకుంటే బెటర్. ఇక మరోవైపు మిరాయ్ 2ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని దర్శకుడు కార్తిక్ భావిస్తున్నారు.;

Update: 2025-09-17 16:45 GMT

సినిమాటోగ్రాఫర్‌ గా ఇండస్ట్రీలో మంచి పేరు సాధించిన కార్తీక్ ఘట్టమనేని, టెక్నికల్‌ గా స్ట్రాంగ్‌ గా ఉంటూనే తక్కువ సమయంలో క్వాలిటీ ఔట్‌ పుట్ ఇవ్వడంలో సక్సెస్ రేట్ బాగానే సంపాదించుకున్నారు. అయితే దర్శకుడిగా మాత్రం ఆయనకు పెద్ద హిట్ అందకపోవడం గమనార్హం. ఈగల్ సినిమాతో చేసిన ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దీంతో ఆయన డైరెక్టర్‌గా కొనసాగే అవకాశాలు చాలా తక్కువే అని సందేహాలు వచ్చాయి.

కానీ అనూహ్యంగా మిరాయ్ విజయంతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకునే ఛాన్స్ దొరికింది. మిరాయ్ సక్సెస్ తరువాత రవితేజ అభిమానులు మాత్రం ఈగల్ 2 గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అసలైన కథను రెండో భాగం కోసం ఆపడం వల్ల ఈగల్ కు అన్యాయం జరిగిందని, అందుకే ఇప్పుడు పార్ట్ 2 తీస్తే రవితేజకు హిట్ ఖాయం అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతన్నారు. ఈ విషయంలో తాను కూడా రెడీగానే ఉన్నానని, పార్ట్ 2 స్క్రిప్ట్ రెడీగా ఉందని కార్తీక్ చెబుతున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఇప్పటికే ఫెయిల్యూర్ అయిన ఈగల్ సినిమాకు సీక్వెల్ చేయడం కంటే, రవితేజ కోసం ఇంకో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడమే మంచిదని చాలామంది సూచిస్తున్నారు. రవితేజపై తనకున్న గౌరవం, అనుబంధం వల్ల ఆయన కోసం తప్పక సూపర్ హిట్ స్టోరీ రాస్తానని కార్తీక్ ఘట్టమనేని కూడా గట్టిగానే చెబుతున్నారు.

అందుకే ఈగల్ 2ను పక్కనపెట్టేసి మాస్ మహారాజ కటౌట్ తగిన ఇంకో కథను రాసుకుంటే బెటర్. ఇక మరోవైపు మిరాయ్ 2ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని దర్శకుడు కార్తిక్ భావిస్తున్నారు. ఇప్పటికే సీక్వెల్‌ కు సంబంధించిన పలు ఐడియాలు సిద్ధంగా ఉన్నాయని, బహుశా ఆ సినిమా తర్వాతే తన కార్తిక్ తదుపరి ప్రాజెక్ట్ లు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈలోగా హీరో తేజ సజ్జా ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందని సమాచారం.

మొత్తానికి, కార్తీక్ ఘట్టమనేని కెరీర్‌ లో మిరాయ్ 2 కీలకమైన దశగా మారడం పక్కా! ఇక ప్రస్తుతం మిరాయ్ అనేక రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. రిలీజైన 5రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఏదేమైనా కార్తిక్ కెరీర్ ను మాత్రం మిరాయ్ నిలబెట్టింది అనడంలో సందేహం లేదు!

Tags:    

Similar News