మార్షల్ లుక్.. కార్తీ న్యూ హై వోల్టేజ్ కథ!
తమిళ్ నటుడు కార్తి తన కెరీర్ లో రెగ్యులర్ కథలకు భిన్నమైన కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటు మలుపుతిప్పుతూ దూసుకుపోతున్నాడు.;
తమిళ్ నటుడు కార్తి తన కెరీర్ లో రెగ్యులర్ కథలకు భిన్నమైన కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటు మలుపుతిప్పుతూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘సత్యం సుందరం’ అనే ఎమోషనల్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తి.. ఇప్పుడు తన 29వ సినిమాగా ఓ ఇంటెన్స్ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు ‘మార్షల్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ, తొలి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని ‘తానక్కారన్’ ఫేమ్ డైరెక్టర్ తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2022లో వచ్చిన తానక్కారన్ ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ‘మార్షల్’ మాత్రం తమిళ్ డైరెక్టర్‌కు థియేట్రికల్ డెబ్యూగా నిలవనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. జాయింట్‌గా ఈషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కార్తి విడుదల చేశారు. పోస్టర్‌లో కార్తి బాడీ లాంగ్వేజ్, గంభీరమైన అటిట్యూడ్ చూస్తుంటే కంటెంట్ హై వోల్టేజ్ అనే తరహాలో ఉండనున్నట్లు అర్ధమవుతుంది. బ్యాక్‌డ్రాప్‌లో పోర్టు హార్బర్ కనిపిస్తుండటంతో కథ సముద్రతీరంలోని ఓ గ్రామం చుట్టూ నడుస్తుందనిపిస్తోంది.
పీరియాడిక్ డ్రామా, గ్రామీణ స్థాయిలో సమాజాన్ని ప్రభావితం చేసే మార్షల్ పాత్రలో కార్తి కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. చిత్రంలో కార్తికి జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తుండగా, సత్యరాజ్, ప్రభు, జాన్ కోక్కెన్, లాల్, ఈశ్వరి రావు లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కెరీర్‌లో మరో కొత్త కోణాన్ని చూపించనుందని భావిస్తున్నారు.
టెక్నికల్ టీమ్ విషయంలోనూ ‘మార్షల్’ ప్రామిసింగ్‌గా ఉంది. సంగీతాన్ని ఈ మధ్య కాలంలో మంచి హిట్‌లతో దూసుకెళ్తున్న సాయి అభ్యంకర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీకి సత్యన్ సూర్యన్, ఎడిటింగ్‌కి ఫిలోమిన్ రాజ్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అరుణ్ వెంజారమూడూ సమకూర్చుతున్నారు. కార్తి ప్రస్తుతం ‘సర్దార్ 2’ (డైరెక్టర్ పిఎస్ మిత్రన్) ‘వా వాథీయార్’ (నాలన్ కుమారసామి) సినిమాలతో బిజీగా ఉన్నాడు.