కుర్ర హీరోతో బెబో ముద్దులాట‌!

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ అంటే కేవ‌లం స్టార్ హీరో స‌ర‌స‌న మాత్ర‌మే క‌నిపించేది. త‌న స్థాయికి త‌గ్గ హీరో అయితేనే హీరోయిన్ ఒకే చెప్పేది.;

Update: 2025-07-25 07:30 GMT

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ అంటే కేవ‌లం స్టార్ హీరో స‌ర‌స‌న మాత్ర‌మే క‌నిపించేది. త‌న స్థాయికి త‌గ్గ హీరో అయితేనే హీరోయిన్ ఒకే చెప్పేది. లేదంటే ఎన్నికోట్లు పారితోషికం ఆఫ‌ర్ చేసినా? ఒకే చేసే వారు కాదు. పారితోషికం కోసం ఆశ పడి సినిమా చేస్తే మార్కెట్ పై ప్ర‌భావం పడుతుంద‌నే భావ‌న‌తో స్టార్ భామ‌లెవ‌రు కూడా యంగ్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకొచ్చేవారు కాదు. కానీ నేడు స‌న్నివేశం అందుకు భిన్నం. హీరో ఇమేజ్ తో ప‌ని లేకుండా క‌థానాయిక‌లు ముందుకొస్తున్నారు.

హీరో కంటే క‌థ‌లో కంటెంట్ ఎలా ఉంది? అన్న ఆలోచ‌న ధోర‌ణి స్టార్ హీరోయిన్ల‌లో క‌నిపిస్తోంది. హీరోతో సంబంధం లేకుండా క‌థ‌, అందులో పాత్ర న‌చ్చితే చాలు పారితోషికంతో కూడా ప‌నిలేకుండా క‌మిట్ అవుతున్నారు. భాష‌తో సంబంధం లేకుండా క‌థ‌లు న‌చ్చాయంటే ఒకే చెబుతున్నారు. ఇటీవ‌లే కీర్తి సురేష్ సుహాస్ కి జోడీగా ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ట‌బు, అనుష్క , త‌మ‌న్నా, శ్రీలీల స‌హా చాలా మంది భామ‌లు ఈ జాబితాలో ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ కూడా ఓ యంగ్ హీరోకి ఒకే చెప్పింది. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఆయాన్ ముఖ‌ర్జీ చిత్రాల‌కు ప‌స‌నిచేసిన హుస్సేన్ ద‌లాల్ ఓ స్టోరీ సిద్దం చేసాడు. ఇందులో హీరోగా ఓ యువ హీరోని తీసుకున్నాడు. అత‌డి పేరు ఇంకా రివీల్ చేయ‌లేదు. హీరోయిన్ గా క‌రీనా క‌పూర్ అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స్ అమెని అప్రోచ్ అయ్యారు. తొలుత ఆమె అంగీక‌రిస్తుందా? లేదా? అన్న సందే హంతోనే వెళ్లారు. కానీ క‌థ విన్నాక క‌రీనా నో చెప్ప‌లేక‌పోయిందిట‌.

హీరోగా ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది కూడా అడ‌గ‌కుండా తాను చేస్తాన‌ని క‌మిట్ అయిందిట‌. ఇందులో క‌రీనా పాత్ర కూడా ఆ యువ హీరోతో ప్రేమ‌లో ప‌డేలా ఉంటుంది. ఆ పాత్ర‌ల మ‌ధ్య ఘాటైన రొమాన్స్ కూడా ఉంటుందని స‌మాచారం. హీరో గురించి మేక‌ర్స్ క‌రీనాకి ఫోన్ చేసి చెప్ప‌గా అదేం పెద్ద విష‌యం కాద‌ని భ‌రోసా ఇచ్చిందిట‌. క‌థ , పాత్ర న‌చ్చ‌డంతోనే అంగీక‌రించిన‌ట్లు తెలిపింది.

Tags:    

Similar News