హీరోయిన్‌ ఉండని ఇంటికి 'లక్ష' కరెంట్‌ బిల్లు

సినిమా వాళ్లు సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడరు, వివాదాస్పద విషయాలకు సాధ్యం అయినంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.;

Update: 2025-04-09 09:43 GMT

సినిమా వాళ్లు సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడరు, వివాదాస్పద విషయాలకు సాధ్యం అయినంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కంగనా రనౌత్‌ మాత్రం హీరోయిన్‌గా ఉన్నప్పటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్‌. ఇండస్ట్రీలో ఉన్న వారితో పాటు, రాజకీయాల్లో ఉన్న వారి గురించి కూడా తన అభిప్రాయంను నిర్మొహమాటంగా చెబుతూ ఉండేది. రాజకీయాల్లో అడుగు పెట్టి, ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆమె అదే తీరున ఫైర్ బ్రాండ్‌ లేడీ ఎంపీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. నటిగా ఈ మధ్య కాస్త స్లో అయిన కంగనా రాజకీయ కార్యక్రమాల్లో చేస్తున్న వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.

కంగనా రనౌత్‌ సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. ఎంపీగా ఢిల్లీలో, నటిగా ముంబైలో ఉంటున్నప్పటికీ ఆమె తనకంటూ స్థానికంగా, సొంత ప్రాంతంలో ఇల్లు ఉంటుంది. మనాలీలో కంగనా రనౌత్‌కి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి అప్పుడప్పుడు మాత్రమే కంగనా వెళ్తు ఉంటుంది. ఆమె లేని సమయంలో ఆ ఇల్లు ఖాళీగా ఉంటుందట. అయినా కూడా ఆ ఇంటికి ఇటీవల లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. తన మనాలీ ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఆ ఇంట్లో నేను ఉండేది లేదు అంటూ కాస్త పన్నీగా మాట్లాడుతూనే అధికార కాంగ్రెస్ పార్టీకి సీరియస్‌గానే కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటుంది, వారి పరిపాలన అనేది అస్థవ్యస్తంగా ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది తోడేళ్ల రాజ్యం, ప్రతి ఒక్కరికీ ఇక్కడ భద్రత అనేది చాలా కష్టమైన విషయం అంటూ కాంగ్రెస్ నాయకులపై కంగనా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కంగనా ఇంటికి వచ్చిన ఆ అధిక మొత్తం కరెంట్‌ బిల్లు గురించి ఎంక్వౌరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అబద్ధం చెప్పినట్లు తేలితే కచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్‌లో ఈమె ఎమర్జెన్సీ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ నిరాశ పరచింది. కానీ ఓటీటీ లో మాత్రం సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ దక్కింది. అంతే కాకుండా కంగనా నటనకు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. పార్లమెంట్‌లో ఒక ఎంపీ స్వయంగా ఆమె వద్దకు వచ్చి ఎమర్జెన్సీ సినిమా గురించి అభినందిస్తూ లేఖ ఇచ్చాడు. ఆ లేఖను కంగనా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన విషయం తెల్సిందే. ఎంపీగా బిజీగా ఉన్న కంగనా మళ్లీ నటిగా ఎప్పుడు బిజీ అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News