థగ్ లైఫ్ ప్రమోషన్స్.. త్రిషను కమల్ అలా అన్నారేంటి?

స్టార్ హీరో కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.;

Update: 2025-04-21 16:42 GMT

స్టార్ హీరో కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, సన్యా మల్హోత్రా సహా పలువురు కీలక పాత్రలు పోషించిన ఆ సినిమా.. జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇంకా 40 రోజుల్లో మూవీ విడుదల అవ్వనుండగా.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.

రీసెంట్ ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఈవెంట్ లో కమల్ హాసన్, శింబు, త్రిష, అశోక్ సెల్వన్ కలిసి పాల్గొన్నారు. త్రిషకు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటని యాంకర్ క్వశ్చన్ చేశారు. దీంతో తనకు ఇష్టమైనవి చాలా ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత ఉడకబెట్టిన అరటి పండ్లు అని చెప్పింది.

కానీ ఆ పేరు సడెన్ గా గుర్తుకురాక.. ఏదో చెప్పబోతుంది. ఇంతలో కమల్ హాసన్ ఇన్వాల్వ్ అయ్యారు. పయం పూరి అని తెలిపారు. వెంటనే అవనని చెప్పింది త్రిష. ఆ తర్వాత పేరు తెలియదు కానీ ఎలా మింగాలో తెలుసని కమల్ అన్నారు. దీంతో త్రిష నవ్వగా.. ఆమె చెయ్యి తట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిషపై కమల్ చేసిన కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారాయి. త్రిషపై కమల్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని కొందరు వ్యాఖ్యానించారు. ఆ జోక్ చీప్ గా అనిపిస్తుందని అంటున్నారు. మరికొందరు మాత్రం అది జోక్ గా తీసుకోవాలని చెబుతున్నారు. సరదాగా ఆటపట్టించారని కామెంట్లు పెడుతున్నారు.

ఇక థగ్ లైప్ విషయానికొస్తే.. తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్‌ లో హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్‌, ఏపీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. నార్త్ లో పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ భారీ ఎత్తున తీసుకొస్తోంది.

సినిమాలో కమల్ హాసన్ రంగరాయ్ శక్తివేల్ నాయకర్ గా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ క్యాస్టింగ్ ఉంది. అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి థగ్ లైఫ్ మూవీ ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News