ప్రతీదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది..కానీ..

ఇకపోతే అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రివ్యూలే తమకు ఊపిరి పోసాయి అని , సినిమా షూటింగ్ మొత్తం ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటూ అంటూ తెలిపింది.;

Update: 2025-12-19 14:30 GMT

కళ్యాణి ప్రియదర్శన్.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో అందరినీ ఆకట్టుకుంది..ఆ తర్వాత కొన్ని చిత్రాలలో చేసిన ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో.. మళ్ళీ తమిళ్ , మలయాళం చిత్రాలకే పరిమితమైంది. చాలా రోజుల తర్వాత లోక చాప్టర్ 1 చంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది..కొత్తలోక అంటూ తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా మంచి ఆదరణ సొంతం చేసుకొని.. అత్యధిక కలెక్షన్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

సాధారణంగా సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రాలు మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అయితే అలాంటి చిత్రాలలో హీరోలకి మాత్రమే ఎవరికో అవకాశం లభిస్తుంది. అలాంటిది ఒక అమ్మాయికి సూపర్ హీరో కాన్సెప్ట్ లో నటించే అవకాశం రావడం అంటే నిజంగా అద్భుతం అనే చెప్పాలి..అలాంటి సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన కొత్త లోక సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది కళ్యాణి ప్రియదర్శన్. ఇకపోతే అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రివ్యూలే తమకు ఊపిరి పోసాయి అని , సినిమా షూటింగ్ మొత్తం ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అంటూ అంటూ తెలిపింది.

సాధారణంగా ఒక సినిమా విడుదలైంది అంటే చాలామంది ప్రేక్షకులు రివ్యూ చూసి థియేటర్ కి వస్తారన్న విషయం వాస్తవమే. ఈ క్రమంలోనే కొత్త లోక సినిమా విడుదలైనప్పుడు సూపర్ హీరోగా ప్రేక్షకులు తనను అంగీకరిస్తారో లేదోనని భయపడ్డ కళ్యాణి ప్రియదర్శన్.. సినిమా మొదటి ఫలితం వచ్చేవరకు గదిలో నుంచి బయటకు రాలేదట. రివ్యూలలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాక తనకు ఊపిరి తిరిగి వచ్చిందని.. ఆ తర్వాతే అందరం బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నామని తెలిపింది. మొత్తానికైతే రివ్యూల వల్లే తనకు మళ్ళీ ఊపిరి అందింది అని చెప్పుకొచ్చింది కళ్యాణి.

అలాగే మరో విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. కొత్తలోక చాప్టర్ 1 లో ఇంటర్వెల్ బ్లాక్ ప్రణాళికలో లేదు.. కానీ మేము చిత్రీకరించిన ప్రతిదీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. ముఖ్యంగా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయి అనే అసంతృప్తి చెందిన డొమినిక్.. ఎడిటింగ్ సమయంలో కథనాన్ని మళ్లీ రూపొందించారు. ఇంటర్ కట్ చేయాలని డొమినిక్ తీసుకున్న నిర్ణయం నేడు దాని గురించి అందరూ మాట్లాడేలా చేసింది. డొమినిక్ అరుణ్ పై నమ్మకం ఉంది కాబట్టే ఆ నమ్మకమే నేడు ఈ సినిమాని ఆ స్థాయిలో నిలబెట్టింది అంటూ కళ్యాణి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News